CHANDRAGIRI SRI KODANDARAMALAYA BRAHMOTSAVAM BEGINS _ ధ్వ‌జారోహ‌ణంతో వైభ‌వంగా చంద్రగిరి శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Tirupati, 06 April 2025: The annual Brahmotsavams began with the Dhwajarohanam ceremony at Chandragiri Sri Kodandaram Swamy Temple on Sunday. 

Special programs were organized in the temple on this occasion.

The ritual was carried under the auspices of Kankanabhattar Sri Srinivasabhattar.

Deputy EO Sri Devendra Babu, several officials and a large number of devotees participated in this event.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ధ్వ‌జారోహ‌ణంతో వైభ‌వంగా చంద్రగిరి శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2025 ఏప్రిల్ 06: చంద్రగిరి శ్రీకోదండరామస్వామివారి ఆల‌యంలో ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా స‌క‌ల‌ దేవ‌త‌ల‌ను బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఆహ్వానిస్తూ ఉద‌యం 8 నుండి 9 గంట‌ల మ‌ధ్య వృష‌భ‌ ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం ఘ‌ట్టాన్ని నిర్వ‌హించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేప‌ట్టారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల రామనామస్మ‌ర‌ణ‌ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. కంక‌ణ‌భ‌ట్టార్ శ్రీ శ్రీ‌నివాస‌భ‌ట్టార్‌ ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర బాబు , పలువురు అధికారులు విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.