BTU BEGINS AT SRI KT WITH DWAJAROHANAM _ ధ్వజారోహణంతో శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Tirupati, 22 Feb. 22: The annual Brahmotsavams of Sri Kapileswara Swamy temple commenced with the Dwajarohanam fete on Tuesday.
The fete was performed in the Meena lagnam at 08.10 am in the presence of Pancha murtis -Sri Skandamurti, Sri Kamakshi Ammavaru, Sri Vinayaka Swamy, Sri Chandikeswarar, Sri Valli Devasena sameta Sri Subramaniam Swamy in Ekantam.
The flag of Brahmotsavam with Nandi portrait was hoisted on the Dwaja Sthambam by the Kankanabhattar Sri Maniswamy.
VISESHA ABHISEKAM OF DWAJA STHAMBAM
Visesha Abhisekam was performed to the Dwaja Sthambham with fruit juices, curd. Sandal, Vibhuti and perfumed water
EKANTHA BRAHMOTSAVAM AS PER COVID: TTD JEO SRI VEERABRAHMAM
Speaking on the occasion the TTD JEO Sri Veerabrahmam said the annual Brahmotsavam of Sri Kapileswara Swamy will be held between February 22 to March 3 inside temple as per covid guidelines.
Thereafter Pallaki utsava was performed for Sri Kapileswara Swamy and Sri Kamakshi Ammavaru.
DyEO Sri Subramaniam AEO Sri Satre Nayak, Superintendent Sri Bhupathi and temple Archakas were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ధ్వజారోహణంతో శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2022 ఫిబ్రవరి 22: తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం 6.30 గంటల నుండి ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. కోవిడ్ – 19 నిబంధనల మేరకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు.
అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వినాయక స్వామి, శ్రీ చండికేశ్వరస్వామి, శ్రీ వల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో ఉదయం 8.10 గంటలకు మీన లగ్నంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు. ఆలయ ప్రధానార్చకులు శ్రీ మణిస్వామి కంకణభట్టర్‌గా వ్యవహరించారు.
ధ్వజస్తంభానికి విశేష అభిషేకం :
ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారు. పెరుగు, చందనం, విభూది, పన్నీరు, పలురకాల పండ్లతో వేడుకగా ధ్వజస్తంభానికి అభిషేకం జరిగింది. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి ఇచ్చారు. ఆ తరువాత ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. అదేవిధంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు.
కోవిడ్ నిబంధనల మేరకు ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు : జెఈవో శ్రీ వీరబ్రహ్మం
ఈ సందర్భంగా జెఈవో శ్రీ వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ ధ్వజారోహణంతో శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు ఫిబ్రవరి 22 నుండి మార్చి 3వ తేదీ వరకు ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.
అనంతరం శ్రీ కపిలేశ్వరస్వామివారికి, శ్రీ కామాక్షి అమ్మవారికి ఆలయంలో పల్లకీ ఉత్సవం నిర్వహించారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామి, అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ సత్రేనాయక్, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.