SRI KALYANA VENKATESWARA SWAMY BRAHMOTSAVAM CONCLUDES _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

Tirupati, 26 February 2025: The nine-day annual Brahmotsavam at Sri Kalyana Venkateswara Swamy Temple in Srinivasa Mangapuram concluded with the traditional temple flag-lowering ceremony, Dhwajavarohanam on Wednesday evening.

All the deities who were invited during the flag-hoisting ceremony were given a ceremonial sendoff with a thanksgiving Dhwajavarohanam.

Spl. Gr.Deputy EO of the temple Smt. Varalakshmi, AEO Sri Gopinath, Vaikhanasa Agama advisor Sri. Mohana Rangacharyulu and other temple staff also participated in this program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2025 ఫిబ్రవరి 26: శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు బుద‌వారం రాత్రి 7 గంట‌ల‌కు ధ్వజావరోహణంతో ముగిశాయి.

గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌, ఆల‌య అర్చకులు బాలాజి రంగ‌చార్యులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.