DWAJAAVAROHANAM AT JUBILEE HILLS SV TEMPLE _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

Hyderabad / Tirupati, March 06, 2025 ‘The nine-day festivities of the annual Brahmotsavam of Marin Venkateswara Swamy temple at Jubilee Hills Hyderabad concludes with  Dwajaavarohanam fete on Thursday evening.

It is believed that those who participated in the Brahmotsavams were freed from all sins and blessed with an abundance of wealth.

AEO Sri Ramesh, other officials and temple priests participated in this program.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్ / తిరుపతి, 2025 మార్చి 06: జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.

సాయంత్రం 6 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు.

బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం.

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ రమేష్, ఇత‌ర అధికారులు, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.