EXTENSIVE ARRANGEMENTS FOR NANDALUR AND THALLAPAKA BRAHMOTSAVAMS _ నందలూరు, తాళ్లపాక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు – టిటిడి జేఈవో శ్రీ. వి. వీరబ్రహ్మం
Tirupati, 25 June 2025: TTD JEO Sri V. Veerabrahmam has instructed officials to make elaborate arrangements for the annual Brahmotsavams at the temples in Nandalur and Tallapaka, located in Annamayya district.
Annual Brahmotsavams at Sri Soumyanatha Swamy temple will be held from July 5 to 13.
Brahmotsavams in Sri Chennakesava Swamy and Sri Siddheswara Swamy temples will take place from July 6 to 15.
Ankurarpanam will be conducted on July 5. Dwajarohanam at Chennakesava temple is on July 6 between 9 and 10 AM, and at Siddheswara temple on July 6 at 6.16 AM.
The JEO directed officials to ensure cleanliness, drinking water, prasadam distribution, proper queue management, and attractive lighting and floral decorations.
He stressed timely Vahana Sevas and arrangements for Kalyanotsavams.
Cultural teams will entertain pilgrims with devotional music and dance programmes while HDPP and Annamacharya Project will conduct daily Harikatha and devotional programs.
SEs Sri Venkateswarlu and Sri Manoharam, Dy EOs Sri Natesh Babu, Sri Sivaprasad, Smt. Prashanti, DFO Sri Phanikumar Naidu, Town Planning Expert Sri Ramudu, and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
నందలూరు, తాళ్లపాక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు – టిటిడి జేఈవో శ్రీ. వి. వీరబ్రహ్మం
తిరుపతి, 2025, జూన్ 25: టిటిడి అనుబంధనంగా ఉన్న అన్నమయ్య జిల్లా నందలూరు, తాళ్లపాకలోని ఆలయాలలో జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం ఆదేశించారు. అధికారులతో కలిసి ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను నందలూరు, తాళ్లపాకలలో పరిశీలించారు.
అన్నమయ్య జిల్లా నందలూరులో శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 05 నుండి 13వ తేదీ వరకు, తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 06 నుండి 15వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయన్నారు. ఈ సందర్భగా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు జూలై 04వ తేదీన, తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయాల బ్రహ్మోత్సవాలకు జూలై 05న అంకురార్పణ జరుగనుందన్నారు.
నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 05న ఉదయం 10.30 నుండి 11.00 గంటల వరకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి.
తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో జూలై 06న ఉదయం 9 నుండి 10 గంటల మధ్య సింహ లగ్నంలో, శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయంలో జూలై 06న ఉదయం 6.16 గం.లకు ధ్వజారోహణంతో బ్రహ్మో త్సవాలు ప్రారంభమవుతాయి.
బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు – జేఈవో
నందలూరు, తాళ్లపాక ఆలయాల వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టినట్లు టిటిడి జేఈవో వెల్లడించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. వాహన సేవలలో సమయ పాలన పాటించాలని కోరారు. ఆలయ పరిసరాలలో ప్రతి రోజూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు దర్శనం, తాగునీరు, ప్రసాదాలు పంపిణీలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నందలూరు, తాళ్లపాకలలో ఆకట్టుకునేలా విద్యుత్ , పుష్ప అలంకరణలు చేపట్టాలన్నారు. ఈ మూడు ఆలయాల్లో కళ్యాణోత్సవాలకు విచ్చేసే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వాహన సేవలో భక్తులను ఆకట్టుకునేలా కళాబృందాలను ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆదేశించారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతి రోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి, సంగీత కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ మనోహరం, డిప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీ శివప్రసాద్, శ్రీమతి ప్రశాంతి, డిఎఫ్వో శ్రీ ఫణికుమార్ నాయుడు, పట్టణీకరణ నిపుణులు శ్రీ రాముడు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.