TTD CHAIRMAN UNVEILS POSTERS OF NANDALUR TEMPLE BRAHMTOSAVAMS _ నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించిన టిటిడి ఛైర్మన్
Tirumala, 26 June 2025: The TTD Chairman Sri B.R. Naidu, along with Additional EO Sri Ch. Venkaiah Chowdary, unveiled the posters of the annual Brahmotsavams of Sri Soumyanatha Swamy temple in Nandalur and Sri Chennakesava Swamy and Sri Siddheswara Swamy temples in Tallapaka.
The event took place on Thursday at the Chairman’s Camp Office in Tirumala.
The Brahmotsavams of Sri Soumyanatha Swamy will be grandly conducted in Nandalur from July 4 to 13.
Similarly, the Brahmotsavams of Sri Chennakesava Swamy and Sri Siddheswara Swamy will be observed in Tallapaka from July 5 to 15.
On this occasion, officials briefed the Chairman on the spiritual prominence and historical background of these temples.
TTD Deputy EOs Sri Natesh Babu and Smt. Prashanthi were also present during the event.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుపతి, 2025, జూన్ 26: అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. తిరుమల టిటిడి ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో టిటిడి అదనపు ఈవోతో కలిసి గురువారం ఛైర్మన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ జూలై 05 నుండి 13వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాలకు జూలై 04వ తేదీ అంకురార్పణ జరుగనుందన్నారు. భక్తులకు స్వామివారి దర్శనం, తాగునీరు, ప్రసాదాలు అందచేయాలని కోరారు.
జూలై 05న ఉదయం 10.30 నుండి 11.00 గంటల వరకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి.
వాహనసేవల వివరాలు :
తేదీ
05-07-2024
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – యాలి వాహనం
06-07-2024
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – హంస వాహనం
07-07-2024
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – సింహ వాహనం
08-07-2024
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – హనుమంత వాహనం
09-07-2024
ఉదయం – శేష వాహనం
రాత్రి – గరుడ వాహనం
10-07-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
11-07-2024
ఉదయం – ఆర్జిత కల్యాణోత్సవం (ఉదయం 10 గంటలకు)
రాత్రి – గజ వాహనం
12-07-2024
ఉదయం – రథోత్సవం (ఉదయం 08 గంటలకు)
రాత్రి – అశ్వవాహనం
13-07-2024
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం
జూలై 11వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 14న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు, శ్రీమతి ప్రశాంతి పాల్గొన్నారు.