PRASADAMS TO PENSIONERS _ నవంబరు 1 నుండి 15వ తేదీ వ‌ర‌కు టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదం పంపిణీ

TIRUPATI, 30 OCTOBER 2023: TTD will issue Brahmotsava Prasadams to Pensioners from November 1-15 in Jabili Bhavan at Tirupati near TTD canteen.

 

The Laddu and Vada prasadams will be distributed PPO numbers-wise on each day.

 

Similarly the pensioners will also be issued the 12-sheet calendars in Pensioners Association Hall.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

నవంబరు 1 నుండి 15వ తేదీ వ‌ర‌కు టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదం పంపిణీ

తిరుపతి, 2023 అక్టోబ‌రు 30: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల అనంతరం టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ పింఛన్‌దార్లకు అందించే శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాన్ని నవంబరు 1 నుండి 15వ తేదీ వ‌ర‌కు అందించ‌నున్నారు. తిరుపతిలోని టీటీడీ క్యాంటీన్ వ‌ద్ద గ‌ల కొత్త జాబిలి భ‌వ‌నంలో ఉద‌యం 10.30 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ప్ర‌సాదాలు పంపిణీ చేస్తారు. పింఛన్‌దార్లు త‌మ స్మార్టు కార్డు చూపి ఒక‌ పెద్ద లడ్డూ, ఒక‌ వడ పొంద‌వ‌చ్చు.

పిపిఓ నంబ‌ర్ల వారీగా ప్ర‌సాదాల పంపిణీ జ‌రుగుతుంది. న‌వంబ‌రు 1, 2వ తేదీల్లో 164 నుండి 3,395 వ‌ర‌కు, న‌వంబ‌రు 3, 4వ తేదీల్లో 3,397 నుండి 5,078 వ‌ర‌కు, న‌వంబ‌రు 6న 5,079 నుండి 6,522 వ‌ర‌కు, న‌వంబ‌రు 7, 8వ తేదీల్లో 6,523 నుండి 7,826 వ‌ర‌కు, న‌వంబ‌రు 9, 10వ తేదీల్లో 7,827 నుండి 9,064 వ‌ర‌కు, న‌వంబ‌రు 13, 14వ తేదీల్లో 9,065 నుండి 10,215 వ‌ర‌కు, నవంబ‌రు 15న 10,216 నుండి మిగిలిన పింఛ‌న్‌దారులంద‌రికీ ప్ర‌సాదాలు అందిస్తారు.

విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ప్రసాదాలను స్వీకరించాలని కోరడమైనది. అదేవిధంగా, 12 పేజీల క్యాలెండ‌ర్ల‌ను పెన్ష‌న‌ర్స్ అసోసియేష‌న్ హాలులో ఉచితంగా పొందాల‌ని కోర‌డ‌మైన‌ది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.