PAVITROTSAVAMS IN SKVST _ నవంబరు 11 నుండి 13వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

Tirupati, 5 Nov. 20: The annual Pavitrotsavams in Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram will be held between November 11 to 13 with Ankurarpanam on November 10 in Ekantam following COVID guidelines.

On November 11 Pavitra Pratista, November 12 Pavitra Samarpana and on November 13 Pavitra Purnahuti will be observed as per Vaikhanasa Agama in the temple. In the morning Snapana Tirumanjanam will be performed to the Utsava Murthies. Arjitha Kalyanotsavam remains cancelled during these three days.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నవంబరు 11 నుండి 13వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుప‌తి, 2020 న‌వంబ‌రు 05: టిటిడికిి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నవంబరు 11 నుండి 13వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తారు.

ఇందుకోసం నవంబరు 10న రాత్రి 7 గంటలకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వ‌హిస్తారు. సంవ‌త్స‌రం పొడ‌వునా ఆల‌యంలో జ‌రిగిన దోషాల నివార‌ణకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా మొదటిరోజైన నవంబరు 11న పవిత్రప్రతిష్ఠ‌, రెండో రోజు నవంబరు 12న పవిత్ర సమర్పణ, చివరిరోజు నవంబరు 13న పూర్ణాహుతి నిర్వ‌హిస్తారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం చేప‌డ‌తారు. పవిత్రోత్సవాల కారణంగా నవంబరు 11 నుండి 13వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవం సేవను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.