SRIVARI LAKSHMI KASULA HARAM PROCESSION ON NOVEMBER 14 _ నవంబరు 14న శ్రీవారి లక్ష్మీకాసుల హారం ఊరేగింపు
Tirumala,13 November 2023: TTD is organising a grand procession of the Srivari Lakhmi Kasula Haram from Tirumala to Tiruchanoor on November 14 to adorn to Sri Padmavati Devi during the Majestic Gaja Vahana on Tuesday night.
The Lakshmi Kasula haram is one of the most precious and significant ornaments of Sri Venkateswara Swamy. It will be paraded along the Mada streets between 8am and 9am. Thereafter it will be taken in ceremonial procession from Tirumala to Sri Padmavati temple at Tiruchanoor.
It is a prestigious tradition that Srivari Lakshmi Kasula Haram is brought for adorning Goddess Padmavati every year during the Gaja Vahana seva in the evening of the fifth day of the annual Karthika Brahmotsavams.
నవంబరు 14న శ్రీవారి లక్ష్మీకాసుల హారం ఊరేగింపు
తిరుమల, 2023 నవంబరు 13: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబరు 14న తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని తిరుచానూరుకు తీసుకెళ్లనున్నారు. శ్రీవారి ఆభరణాలలో అత్యంత ప్రధానమైన లక్మీకాసుల హారాన్ని ఉదయం 8 నుండి 9 గంటల వరకు తిరుమలలోని ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగిస్తారు.
అనంతరం తిరుమల నుండి బయల్దేరి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. మంగళవారం రాత్రి జరిగే గజ వాహనసేవలో అమ్మవారికి ఈ లక్ష్మీకాసుల హారాన్ని అలంకరిస్తారు. శ్రీవారి కాసులహారాన్ని ప్రతి ఏటా గజ వాహనం సందర్భంగా అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.