ANNABHISHRKAM IN KT _ నవంబరు 15న శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం

TIRUPATI, 06 NOVEMBER 2024: Annabhishekam on the occasion of Karthika Pournami will be performed on November 15 in Sri Kapileswara Swamy temple.

On that day, Anna Linga Darshanam will be from 4pm to 6pm while Anna Linga Udwasana will be between 6pm and 7pm followed by special Abhishekam with aromatic ingredients in Ekantam between 7pm and 8pm.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నవంబరు 15న శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం

తిరుపతి, 2024 నవంబరు 06: తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 15వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినాన అన్నాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఉదయం 2 గంట‌ల‌కు సుప్ర‌భాతంతో మేల్కొలిపి, 2.30 నుంచి 4.30 గంటల వరకు అభిషేకం, అలంకారం, అర్చ‌న నిర్వ‌హిస్తారు. మ‌ధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపడతారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం రాత్రి 7 నుండి 8 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం ఏకాంతంగా నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.