KARTIKA VANABHOJANAM IN SRINIVASA MANGAPURAM ON NOVEMBER 16 _ నవంబరు 16న శ్రీనివాసమంగాపురంలో కార్తీక వనభోజనం
Tirupati, 12 November 2025: The Kartika Vanabhojanam will be held on November 16 at Srinivasa Mangapuram.
It is a tradition to hold Vanabhojanam here during the holy month of Kartika.
As part of this, the ceremonial idols of the deities are taken out of the temple in a procession at 7 am and taken to the Parveta Mandapam at Srivari Mettu at 9 am.
The Snapana Tirumanjanam ceremony is observed between 10 am and 11 am. The deities return to the temple in the evening.
Owing to this, the regular Kalyanotsavam Arjitha Seva has been cancelled in the temple.
After Snapanam, the community dining program- Vana Bhojanam is observed.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
నవంబరు 16న శ్రీనివాసమంగాపురంలో కార్తీక వనభోజనం
తిరుపతి, 2025, నవంబర్ 12: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నవంబరు 16న కార్తీక వనభోజన కార్యక్రమం జరుగనుంది. ఈ కారణంగా నిత్య కల్యాణోత్సవం ఆర్జిత సేవ రద్దయింది. పవిత్రమైన కార్తీక మాసంలో ఇక్కడ వనభోజన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇందులో భాగంగా ఉదయం 7 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి ఉదయం 9 గంటలకు శ్రీవారి మెట్టు వద్దగల పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ఆ తరువాత అలంకారం, వనభోజనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్కడి నుండి సాయంత్రం 4 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
