KARTIKA VANABHOJANAM AT SRINIVASA MANGAPURAM ON NOVEMBER 27 _ నవంబరు 27న శ్రీ‌నివాస‌మంగాపురంలో కార్తీక వ‌న‌భోజ‌నం

Tirupati, 26 November 2024: Kartika Vanabhojanam program will be held on November 27 at Srinivasa Mangapuram.

Due to this, Nithya Kalyanotsavam Arjita Sevas have been cancelled. 

In the holy month of Kartika, on Dwadashi, it is a tradition to organize Vanabhojanam every year.

As part of this, from 7 am to 9 am, the Utsava Murtis of Swami and Ammavarlu will be taken on a procession from the temple and offered Snapanam at worshipped at the Paruveta Mandapam near Srivari Mettu followed by Vana Bhojanam.

After that the deities will return to the temple at 5 pm.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నవంబరు 27న శ్రీ‌నివాస‌మంగాపురంలో కార్తీక వ‌న‌భోజ‌నం

తిరుప‌తి, 2024 నవంబరు 26: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 27న కార్తీక వనభోజన కార్యక్రమం జరుగనుంది. ఈ కార‌ణంగా నిత్య‌ కల్యాణోత్సవం ఆర్జిత సేవ ర‌ద్ద‌యింది.

పవిత్రమైన కార్తీక మాసంలో ద్వాద‌శి నాడు ఇక్క‌డ వనభోజన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి ఉదయం 9 గంటలకు శ్రీవారి మెట్టు వద్దగల పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ఆ తరువాత అలంకారం, వ‌న‌భోజ‌నం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్క‌డి నుండి సాయంత్రం 5 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.