KASULA HARAM PROCESSION _ నవంబరు 27న శ్రీవారి లక్ష్మీకాసుల హారం ఊరేగింపు
Tiruchanoor, 26 Nov. 19: The procession of Lakshmi Kasula Haram will be observed in Tirumala on November 27 between 8am and 9am.
Every year on the occasion of Gaja and Garuda Vahana sevas in Tiruchanoor Ammavari Brahmotsavams, the Lakshmi Kasula Haram brought from Tirumala will be decked to Goddess Padmavathi Devi on these two days.
The Haram will reach Pasupu Mandapam at Tiruchanoor from Tirumala amidst tight security. From there it will be paraded to the temple amidst melam, kolatam and bhajan teams presenting their arts in a grand manner on Wednesday morning.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
నవంబరు 27న శ్రీవారి లక్ష్మీకాసుల హారం ఊరేగింపు
తిరుమల, 2019 నవంబరు 26: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబరు 27న బుధవారం తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని తిరుచానూరుకు ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. శ్రీవారి ఆభరణాలలో అత్యంత ప్రధానమైన లక్మీకాసుల హారాన్ని ఉదయం 8 నుండి 9 గంటల వరకు తిరుమలలోని ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగిస్తారు.
అనంతరం తిరుమల నుండి బయల్దేరి తిరుచానూరులోని పసుపు మండపానికి తీసుకొస్తారు. పసుపు మండపం నుంచి మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటల మధ్య శోభాయాత్రగా అమ్మవారి ఆలయానికి తీసుకెళతారు. బుధవారం రాత్రి జరిగే గజ వాహనసేవలో అమ్మవారికి ఈ లక్ష్మీకాసుల హారాన్ని అలంకరిస్తారు. శ్రీవారి కాసులహారాన్ని ప్రతి ఏటా గజ, గరుడ వాహనాల సందర్భంగా అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.