న‌వంబ‌రు 4 నుండి 11వ‌ తేదీ వరకు వ‌స్త్రాల ఈ – వేలం

న‌వంబ‌రు 4 నుండి 11వ‌ తేదీ వరకు వ‌స్త్రాల ఈ – వేలం

తిరుపతి, 2024 అక్టోబ‌రు 30: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను న‌వంబ‌రు 4 నుండి 11వ‌ తేదీ వరకు ఈ – వేలం ( ఆన్ లైన్ లో) వేయనున్నారు. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 358 లాట్లు ఉన్నాయి.

ఇందులో ఆర్ట్ సిల్క్/ పాలిస్టర్ దోతీలు, ఉత్తరీయాలు, ఆర్ట్ సిల్క్/ పాలిస్టర్ /నైలాన్ /నైలెక్స్ చీరలు, ఆఫ్ చీరలు, క్లాత్ బిట్స్‌, బ్లౌజ్‌పీస్‌లు, ఉత్త‌రీయాలు, ట‌ర్కీ ట‌వ‌ళ్లు, లుంగీలు, శాలువ‌లు, బెడ్‌షీట్లు,
హుండీ గ‌ల్లేబులు, దిండుక‌వ‌ర్లు, పంజాబి డ్రెస్ మెటీరియ‌ల్స్‌, జంకాళం కార్పెట్లు, దుప్ప‌ట్లు, క‌ర్ట‌న్లు, గ‌ర్భ‌గృహ కురాళాలు, బంగారువాకిలి ప‌ర‌దాలు, శ్రీవారి గొడుగులు ఉన్నాయి.

ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org / www.konugolu.ap.govt.in సంప్రదించగలరు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.