ANNABHISHEKAM AT SRI KAPILESWARA SWAMY TEMPLE ON NOV 8 _ నవంబరు 8న శ్రీకపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం
TEMPLE WILL BE CLOSED ON NOV 8 FOR 11 HOURS
Tirupati, 5 November 2022: As part of the Karthika pournami fete TTD is organizing grand Annabhisekam in the early hours on November 8 at the Sri Kapileswara temple ahead of closure for 11 hours in view of the lunar eclipse from 08.30 am- 7.30 pm.
The festivities include Shudhodaka abhisekam in Ekantha, Deeparadhana and Anna Linga Darshan, followed by Ekantha Abhisekam.
After opening the temple shuddi, Abhisekam, Sahasra namarchana,nivedana, Deeparadhana and Ekantha Seva are performed.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నవంబరు 8న శ్రీకపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం
– చంద్రగ్రహణం కారణంగా 11 గంటల పాటు ఆలయ తలుపులు మూత
తిరుపతి, 2022 నవంబరు 05: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 8వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినాన అన్నాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు. చంద్రగ్రహణం కారణంగా ఉదయం ఉదయం 8.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంచుతారు.
ఈ సందర్భంగా ఉదయం 3 నుంచి 3.30 గంటల వరకు ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, ఉదయం 3.30 నుంచి 5.30 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపడతారు. ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. ఉదయం 7.30 నుంచి 8 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం ఉదయం 8 నుండి 8.30 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం ఏకాంతంగా నిర్వహిస్తారు.
చంద్రగ్రహణం కారణంగా ఉదయం 8.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి 8 గంటల వరకు శుద్ధి చేస్తారు. ఆ తరువాత భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 8 నుండి 8.30 గంటల వరకు అభిషేకం, రాత్రి 8.30 నుండి 10 గంటల వరకు అలంకారం, సహస్రనామార్చన, నివేదన, దీపారాధన, రాత్రి 10 నుండి 10.15 గంటల వరకు ఏకాంత సేవ నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.