LAKSHA KUMKUMARCHANA ON NOV 9 _ నవంబరు 9న శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ANKURARPANAM ON THE SAME DAY
DHWAJAROHANAM ON NOV 10
TIRUPATI, 06 NOVEMBER 2023: The annual brahmotsavam in Tiruchanoor Sri Padmavathi Ammavari temple scheduled to commence from November 10 with Ankurarpanam on November 9.
Laksha Kumkumarchana will be observed in the morning of Wednesday between 8am and 12noon.
As part of Ankurarpanam, in the evening Punyahavachanam, Raksha Bandhanam, Senadhipati Utsavam will be observed between 6:30pm and 8:30pm.
On November 10, the Navahnika Karthika brahmotsavams begins with Dhwajarohanam between 9. 10am and 9:30am in the auspicious Dhanur Lagnam.
Everyday there will be Vahana sevas in the morning at 8am and 10am while in the evening between 7pm and 9pm.
November 10: Dhwajarohanam Chinna Sesha Vahanam
November 11: Pedda Sesha Vahanam, Hamsa Vahanam
November 12: Mutyapu Pandiri, Simha
November 13: Kalpavriksha, Hanumantha
November 14: Mohini(Pallaki Utsavam), Vasanthotsavam, Gaja Vahanam
November 15: Sarvabhoopala, Swarna Ratham, Garuda Vahanam
November 16: Suryaprabha, Chandraprabha
November 17: Rathotsavam, Aswa
November 18: Panchami Theertham, Dhwajavarohanam
On November 19, the immediate day after annual brahmotsavams, Pushpayagam will be observed.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
నవంబరు 9న శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
– ఉదయం లక్షకుంకుమార్చన
తిరుపతి, 2023 నవంబరు 06: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు నవంబరు 9వ తేదీ గురువారం అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్షకుంకుమార్చన నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపడతారు.
నవంబరు 10న ధ్వజారోహణం
ఆలయంలో నవంబరు 10న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.10 నుండి 9.30 గంటల మధ్య ధనుర్ లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
వాహనసేవల వివరాలు :
10-11-2023 – ధ్వజారోహణం, చిన్నశేషవాహనం.
11-11-2023 – పెద్దశేషవాహనం, హంసవాహనం.
12-11-2023 – ముత్యపుపందిరి వాహనం, సింహవాహనం.
13-11-2023- కల్పవృక్ష వాహనం, హనుమంతవాహనం.
14-11-2023 – పల్లకీ ఉత్సవం, వసంతోత్సవం, గజవాహనం.
15-11-2023- సర్వభూపాల వాహనం, స్వర్ణరథం, గరుడవాహనం.
16-11-2023- సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం.
17-11-2023 – రథోత్సవం, అశ్వ వాహనం.
18-11-2023- పంచమితీర్థం, ధ్వజావరోహణం.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.