NAVANEETA KRISHNA STEALS THE HEARTS _ న‌వ‌నీత‌ కృష్ణాలంకారంలో రామ‌య్య ముగ్ధ‌మ‌నోహ‌ర రూపం

Vontimitta /Tirumala, 09 April 2025: The annual Brahmotsavams at Vontimitta Sri Kodandarama Temple entered fourth day on Wednesday.

As a part of this annual mega religious fete, Sri Ramachandra decked up as Navaneeta Krishna charmed the devotees.

Temple officials and a large gathering of devotees participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

న‌వ‌నీత‌ కృష్ణాలంకారంలో రామ‌య్య ముగ్ధ‌మ‌నోహ‌ర రూపం

ఒంటిమిట్ట / తిరుపతి 2025 ఏప్రిల్ 09: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం న‌వ‌నీత‌ కృష్ణాలంకారంలో రాముల‌వారు ముగ్ధ‌మ‌నోహ‌రంగా ద‌ర్శ‌న‌మిచ్చారు.

ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

పురాణాల ప్రకారం.. కృష్ణుడు వెన్న‌దొంగ‌. రేప‌ల్లెలో బాల‌కృష్ణుడు య‌శోద‌మ్మ ఇంట్లోనే గాక అంద‌రి ఇళ్ల‌లోకి వెళ్లి వెన్న ఆర‌గించేవారు. ఈ చిన్నికృష్ణుడి లీల‌ల‌ను గుర్తు చేస్తూ రాముల‌వారు వెన్న‌కుండ‌తో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్‌ శ్రీ హ‌నుమంత‌య్య‌, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ న‌వీన్‌, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.