DEVOTIONAL TREAT _ నాదనీరాజనం వేదికపై ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనలు
DEVOTIONAL TREAT
TIRUMALA, 22 OCTOBER 2023: The Nada Neerajanam platform in Tirumala emerged out to be a divine stage hosting several spiritual programs.
In the evening the Annamacharya Sankeertans rendered by the renowned musician Sri Modumudi Sudhakar and his team enthralled the devotees.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నాదనీరాజనం వేదికపై ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనలు
తిరుమల, 2023 అక్టోబరు 22: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం నాదనీరాజనం వేదికపై ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ మోదుమూడి సుధాకర్ బృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తిభావాన్ని పంచాయి.
శ్రీ మోదుమూడి సుధాకర్ నేతృత్వంలో “అన్నమయ్య సంకీర్తన పదరసాయనం” పేరుతో అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచి రికార్డు చేశారు. ప్రస్తుతం శ్రీమతి మోదుమూడి అంజన, కుమారి శృతిరంజని, కుమారి తేజస్వి, కుమారి రంజనితో కలిసి ఈ సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి డాక్టర్ విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.