NADA NEERAJANAM HOSTS UGADI KAVI SAMMELANAM _ నాద నీరాజనం వేదికపై వైభవంగా ఉగాది కవి సమ్మేళనం
TIRUMALA, 30 MARCH 2025: The Nada Neerajanam platform in Tirumala on Sunday hosted the popular Kavi Sammelanam which entertained the devotees.
Kavi Sammelanam is a unique literary fete which is observed in a jubilant manner during the Ugadi festival.
It is often considered as Telugu pride as the events hosts a galaxy of literature experts who deliver speeches on various subjects in a poetic way.
In this programme hosted by SVBC, renowned scholars including Sri Surabhi Shankar Rao, Sri Annapantula Jagannatha Rao, Dr Mylavarapu Murali Krishna, Sri S Saiprasad, Sri Ponnuganti Surya Narayana, Kumari Surabhi Balaraghva Suharshini, Sri Chinta Ramakrishna delivered poetry on various welfare activities of TTD, glory of Telugu and its culture in a heart touching manner.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నాద నీరాజనం వేదికపై వైభవంగా ఉగాది కవి సమ్మేళనం
తిరుమల, 2025 మార్చి 30: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాద నీరాజనం వేదికపై కవి సమ్మేళనం కార్యక్రమం వైభవంగా జరిగింది.
టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ ఆధ్వర్యంలో షడ్రుచుల సమ్మేళనం, సప్త పర్వత సమ్మేళనంగా ఈ కార్యక్రమం సాగింది. కవులు, అవధానులైన శ్రీ సురభి శంకర శర్మ, శ్రీ అన్నాపంతుల జగన్నాథరావు, డాక్టర్ శ్రీ మైలవరపు మురళీకృష్ణ, శ్రీ ఎస్.సాయిప్రసాద్, శ్రీ పొన్నెగంటి సూర్య నారాయణ, కుమారి సురభి బాల రాఘవ సుహార్షిణి, శ్రీ చింతా రామకృష్ణ రావు తెలుగు భాష వైభవం, మన సంస్కృతి, సాంప్రదాయాలు, టీటీడీ భక్తులకు చేస్తున్న సేవలపై పద్యాల రూపంలో వివరించారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.