ANKURARPANAM AT NARAYANAVANAM TEMPLE _ నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు  అంకురార్పణ 

Tirupati,30, May 2023: Ahead of the annual Brahmotsavam celebrations of Sri Kalyana Venkateswara Temple, TTD on Tuesday night performed the Ankurarpanam fete.

The nine-day celebrations will commence on Wednesday morning with  Dwajarohanam.

All arrangements with shamianas and electrical and flower decorations were made for the event.

AEO Sri Mohan, superintendent Sri Ekambaranathar, Inspector sriNagraj, temple archakas and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు  అంకురార్పణ
 
 తిరుపతి, 2023 మే 30: నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
 
ఈ సందర్భంగా రాత్రి 7.30 నుండి 9.30 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం  బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.
 
మే 31న ధ్వజారోహనం :
 
శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు బుధవారం ఉదయం 6.30 గంటల  నుండి 7.30 గంటల వరకు ఆగమోక్తంగా ధ్వజారోహణం జరుగనుంది. బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. 
 
ఈ కార్యక్రమంలో ఏఈవో  శ్రీ మోహన్, సూపరింటెండెంట్ శ్రీ ఏకాంబరం, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.