KOIL ALWAR TIRUMANJANAM HELD _ శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
TIRUPATHI, 06 MAY 2025: Koil Alwar Tirumanjanam was held on Tuesday in view of the annual Brahmotsavam at Narayanavanam Sri Padmavathi Sametha Kalyana Venkateswara Swamy Temple scheduled from May 11 to 19.
It is customary to perform Koil Alwar Tirumanjanam, the traditional temple cleansing ritual before Brahmotsavam.
Tirumanjanam was held from 8 am to 2 pm. In this, after purifying the temple premises, walls, roofs, worship materials etc. with Parimalam, a holy mixture devotees were allowed for darshan from 3 pm onwards.
Chief priest Sri Sridhar Bhattacharyulu, Temple Inspectors Sri. Nagaraju, Sri Bharath participated in this program.
Vahana sevas will be held from 7.30 am to 9.30 am and again from 7 pm to 9 pm every day during Brahmotsavams.
Important fetes during annual brahmotsavams includes Dhwajarohanam on May 11, Garuda Vahanam on May 15, Rathotsavam and Kalyanam on May 18, Chakrasnanam on May 19.
Grihastas shall have to pay Rs.1000 per ticket on which two persons will be allowed for Kalyanam.
TTD has arranged devotional cultural programmes during the annual brahmotsavams.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2025 మే 06: నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 11 నుండి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శ్రీధర్ భట్టాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ నాగరాజు, శ్రీ భరత్ తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజూ ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
11-05-2025
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – పెద్దశేష వాహనం
12-05-2025
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం
13-05-2025
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం
14-05-2025
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం
15-05-2025
ఉదయం – మోహినీ అవతారం
రాత్రి – గరుడ వాహనం
16-05-2025
ఉదయం – హనుమంత వాహనం
రాత్రి – గజ వాహనం
17-05-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
18-05-2025
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం, కల్యాణోత్సవం
19-05-2025
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం
మే 18వ తేదీ రాత్రి 8.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. రూ.1000 చెల్లించి గృహస్తులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక వడ, కుంకుమ బహుమానంగా అందజేస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.