GUDIKO-GOMATA PROGRAM SUCCESSFULLY LAUNCHED IN FOUR STATES _ నాలుగు రాష్ట్రాల్లో గుడి కో గో మాత – త్వరలో కల్యాణమస్తు ప్రారంభం : టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
KALYANAMASTU TO BE RELAUNCHED FOR THE BENEFIT OF POOR- TTD CHAIRMAN
Tirumala, 4 Feb. 21: The Gudiko-Gomata program launched by the TTD as part of the propagation of Hindu Sanatana Dharma which has been successfully grounded in four states of Andhra Pradesh, Telangana, Karnataka and Delhi said TTD Chairman Sri YV Subba Reddy.
Participating in Gudiko-Gomata program in Sri Kasi Vishweswara temple at Sathyanarayanapuram in Vijayawada on Thursday wherein he presented a Kapila Gow (black/dark skinned cow considered as most auspicious) by the Sri Gayatri Society he took part in the puja.
After performing Go puja the Chairman said the TTD had taken up the Gudiko Gomata campaign under directions of AP Chief Minister Sri YS Jaganmohan Reddy for the propagation of Hindu dharma.
He said TTD will present a pair of cow and calf to temples anywhere in the country who shoulders responsibility for maintaining them.
Adding further he said TTD has launched several programs for the propagation and protection of Sanatana Hindu dharma.
TTD will soon relaunch the Kalyanamastu program facilitating the mass weddings of the poor free of cost, he added.
He said under the aegis of the HDPP, TTD proposed to speed up the construction of 500 Venkateswara Swamy temples in SC/ST and fishermen remote villages in both Telugu states which were delayed due to Covid-19.
AP Endowments Minister Sri Vempalli Srinivasa Rao, MLA and Chairman of the Brahmin Corporation Sri Malladi Vishnu, AP Fibernet Corporation Chairman Sri P Gautam Reddy, Pontiff of Sri Gayatri peetham Sri Ragananda Swamy, Temple chairman Sri Mupurti Raju and temple EO Sri Sitaramaiah and officials were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నాలుగు రాష్ట్రాల్లో గుడి కో గో మాత
– త్వరలో కల్యాణమస్తు ప్రారంభం_ టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
తిరుమల 4 జనవరి 2021: హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ ప్రారంభించిన గుడికో గోమాత కార్యక్రమం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతోందని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.
విజయవాడ సెంట్రల్ పరిధిలోని సత్యనారాయణ పురం లోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో గురువారం గుడికో గోమాత కార్యక్రమం నిర్వహించారు. శ్రీ గాయత్రి సొసైటీ వారు ఆలయానికి కపిల గోవును బహూకరించారు. టీటీడీ చైర్మన్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని శాస్త్రోక్తంగా గోపూజ చేసి ఆలయానికి గోవును అందించారు. ఈ సందర్భంగా శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించిందన్నారు. దేశ వ్యాప్తంగా ఏ ఆలయం అయినా టీటీడీని కోరితే ఈ కార్యక్రమం ద్వారా ఆలయానికి గోమాత, దూడను అందిస్తుందన్నారు. వీటి పోషణ భాద్యత ఆ ఆలయమే తీసుకోవాలని చైర్మన్ చెప్పారు.
హిందూ ధర్మ పరిరక్షణ కోసం టీటీడీ ద్వారా దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామని ఆయన చెప్పారు.
గత ప్రభుత్వం మంగళం పాడిన కళ్యాణమస్తు కార్యక్రమం త్వరలో ప్రారంభించ బోతున్నామన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మత్స్య కార గ్రామాల్లో త్వరలోనే 500 దేవాలయలను నిర్మిస్తామని తెలిపారు.
కరోనా కారణంగా ఈ కార్యక్రమంఆలస్యమైందన్నారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు, శాసన సభ్యుడు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్లాది విష్ణు, ఎపి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ పి.గౌతమ్ రెడ్డి, శ్రీ గాయత్రి పీఠాధి పతి శ్రీ రాగానంద స్వామి, ఆలయ చైర్మన్ శ్రీ ముప్పూరి రాజ, ఆలయ ఈవో శ్రీ సీతారామయ్య తో పాటు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది