VIGILANCE & SECURITY_ నిఘా మరియు భద్రతా విభాగము
నిఘా మరియు భద్రతా విభాగము
తిరుపతి, జూన్-28, 2008: తి.తి.దే వారు ప్రతి సంవత్సరము ఎంతో భారీఎత్తున ఉద్యోగస్థులకు, వారి కుటుంబసభ్యులు మానసిక వికాసము కొరకు వివిధ రకాల ఆటలు, క్రీడల పోటీలు నిర్వహిస్తున్నది.
అదేవిధంగా యీ సంవత్సరము జూలై నెలలో తి.తి.దే ఉద్యోగులకు ఆటలు, క్రీడాపోటీలు నిర్వహించుటకు కార్యనిర్వహణాధికారి అనుమతించారు. కావున ఆసక్తి గల టి.టి.డి ఉద్యోగస్థులు, వారి కుటుంబసభ్యులు వారికి ప్రావీణ్యము గల క్రీడలలో ఉత్సాహంగా పాల్గొనాలని యీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము.
వివిధ క్రీడల వివరాలు, తేదీలు, సమయము, స్థలము, తదితర విషయాలు ప్రత్యేక ప్రకటనలో తెలియచేస్తాము.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.