నిత్యాన్నదానం ట్రస్టుకు రూ.5 లక్షలు విరాళం
నిత్యాన్నదానం ట్రస్టుకు రూ.5 లక్షలు విరాళం
తిరుపతి, ఏప్రిల్ 02, 2013: కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని మారుతి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ సంస్థ మంగళవారం ఎస్వీ నిత్యాన్నదానం ట్రస్టుకు రూ.5 లక్షలు విరాళంగా అందజేసింది. ఈ మేరకు చెక్కును తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో గల నిత్యాన్నదానం ట్రస్టు కార్యాలయంలో దాతలు అందజేశారు. ఈ మొత్తాన్ని తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు ఖర్చు చేయాలని దాతలు కోరారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.