SIX VEHICLES SEIZED AT ALIPERI FOR OVERLOADING _ నిబంధనలు అతిక్రమించిన వాహనాలపై చర్యలు

TIRUMALA TIRUPATI DEVASTHANAMS

SIX VEHICLES SEIZED AT ALIPERI FOR OVERLOADING

Tirumala, 07 October 2024: The Tirupati transport department has seized six vehicles (three tempos & three jeeps) plying on Tirumala ghat roads for overloading and violation of permit norms.

The action came after a surprise check by RTO Sri K Muralimohan and vehicles impounded were kept at the Alipiri police station.

norms.

Inspector Sri Prasad Verma and Smt. Swarnalatha who participated in the surprise inspections have warned that action will be taken against all taxis etc. that do not comply with motor vehicle rules.

Tirumala Tirupati Devasthanam Executive Officer Sri. J Syamala Rao and Tirupati District Superintendent of Police Sri Subbarayudu directed the Police Department and the Transport Department to regulate the traffic and take strict action against the vehicles for violating the rules.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నిబంధనలు అతిక్రమించిన వాహనాలపై చర్యలు

తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆధ్వర్యంలో తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు జరిగిన వాహన తనిఖీలలో
భాగంగా ఆరు వాహనాలను (3 టెంపోలు మరియు మూడు జీపులు ) స్వాధీనం చేయడం జరిగింది. సదరు వాహనాల్ని అలిపిరి పోలీస్ స్టేషన్ నందు స్వాధీన పరచడం జరిగింది.

పరిమితికి మించిన ప్రయాణికులతో మరియు పర్మిట్ నిబంధనలను అతిక్రమించిన వాహనాలపై తనిఖీ రసీదులు నమోదు చేయడం జరిగింది.

ఈ తనిఖీలలో సహాయమోటార్ వాహనాల తనిఖీ అధికారి ప్రసాద్ వర్మ మరియు శ్రీమతి స్వర్ణలత పాల్గొన్నారు. మోటార్ వాహనాల నిబంధనలను పాటించని వాహనాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వాణ అధికారి శ్రీ శ్యామల రావు గారు మరియు జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సుబ్బరాయుడు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించమని మరియు నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకోమని పోలీస్ శాఖ వారిని రవాణా శాఖ వారిని ఆదేశించారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది