COMPLETE CHILDRENS’ HOSPITAL WORKS ON TIME-JEO(E & H) _ నిర్దేశిత వ్యవధిలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : జెఈఓ శ్రీమతి సదా భార్గవి

TIRUPATI, 24 NOVEMBER 2022: The construction works of the Pediatric Hospital should complete within the stipulated time, said TTD JEO for Education and Health Smt Sada Bhargavi.

After her inspection at Sri Padmavathi Children’s Hospital which is coming up in the Zoopark Road near Alipiri on Thursday evening, the JEO instructed the Engineering officials concerned to complete the works on time.

She directed them to finish the ground-level works by December. “Out of 226 columns, so far 69 columns were completed. There is considerable progress in works since last three weeks”, she observed.

She instructed the engineering officials to conduct weekly review meetings on the progress of works to complete the construction of the hospital within the scheduled time as planned.

CE Sri Nageswara Rao, SE Electrical Sri Venkateswarulu, EE Sri Krishna Reddy, DFO Sri Srinivas and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నిర్దేశిత వ్యవధిలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : జెఈఓ శ్రీమతి సదా భార్గవి

తిరుపతి, 2022 నవంబరు 24: తిరుపతిలోని అలిపిరి జూపార్క్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయాలని టిటిడి జెఈఓ శ్రీమతి సదా భార్గవి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి పనులను గురువారం జెఈఓ పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ మూడు వారాల ముందు పరిశీలించినప్పటికీ, ఇప్పటికీ పనుల్లో పురోగతి ఉందన్నారు. డిసెంబరు లోపు గ్రౌండ్ లెవల్ వరకు పనులు పూర్తి చేయాలన్నారు. బేస్మెంట్ కు సంబంధించి మొత్తం 226 కాలమ్స్ గాను ఇప్పటివరకు 69 కాలమ్స్ నిర్మాణం జరిగిందని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న విద్యుత్ లైన్లను సంబంధిత అధికారులతో చర్చించి తొలిగించాలన్నారు. కార్మికుల సంఖ్యను పెంచడం ద్వారా పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఆసుపత్రి పనులపై ప్రతి వారం సమీక్ష నిర్వహించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

జెఈఓ వెంట చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ(ఎలక్ట్రికల్స్) శ్రీ వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీ కృష్ణారెడ్డి, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.