ADDITIONAL EO INSPECTS PAC -5 BUILDING WORKS _ నిర్మాణంలో ఉన్న పీఏసీ-5 భవనంలో అదనపు ఈవో తనిఖీలు
Tirumala, 08 April 2025: The TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary on Tuesday inspected the newly constructed Pilgrim Amenities Complex (PAC-5) in Tirumala to oversee the ongoing works.
On this occasion, he inquired about the progress of the development works from the engineering officials.
He inquired about the arrangements being made for the devotees in the new building including Dining hall, lockers and toilets and made several suggestions to the officials.
He instructed the officials to arrange all the facilities so that the devotees do not face any inconvenience.
Earlier, the Additional EO reviewed the progress of the construction work of PAC-5 with the officials of the concerned departments at Annamayya Bhavan.
Deputy EOs Sri Rajendra, Sri Harindhranath, Sri Venkataiah, EEs Sri Venu Gopal, Sri Sudhakar, Electrical DE Sri Chandra Sekhar, VGO Sri Surendra and other officials participated in this program.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
నిర్మాణంలో ఉన్న పీఏసీ-5 భవనంలో అదనపు ఈవో తనిఖీలు
తిరుమల, 2025 ఏప్రిల్ 08: తిరుమలలో నూతనంగా నిర్మిస్తున్న యాత్రికుల వసతి సముదాయం (పీఏపీ-5) లో మంగళవారం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల పురోగతి గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నూతన భవనంలో భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. కళ్యాణకట్ట, డైనింగ్ హాల్, లాకర్ల ఏర్పాటు, మరుగుదొడ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అంతకుముందు అన్నమయ్య భవన్ లో పీఏసీ-5 నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత విభాగాల అధికారులతో అదనపు ఈవో సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ రాజేంద్ర, శ్రీ హరీంధ్రనాథ్, శ్రీ వెంకటయ్య, ఈఈలు శ్రీ వేణు గోపాల్, శ్రీ సుధాకర్, డీఈ శ్రీ చంద్ర శేఖర్, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.