నూతన కోర్సుకు అడ్మిషన్లు
నూతన కోర్సుకు అడ్మిషన్లు
తిరుపతి, ఆగష్టు -12, 2009: శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలో బి.యస్.సి. క్యాటరింగ్, టూరిజమ్ మరియు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు నందు చేరుటకు అడ్మిషన్లు జరుగుచున్నవని కళాశాల ఫ్రిన్సిపాల్ శ్రీ యన్.నాగేంద్రసాయి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కోర్సునందు చేరుటకు చివరి తేది:17-08-2009. ఆసక్తి గల విద్యార్థులు పై తేది లోపల ఫీజు, అన్ని సర్టిఫికెట్లతో హాజరు కావలసినదిగా కోరడమైనది. కోర్సు ప్రారంభించుటకు ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు లభించినట్లు ఫ్రిన్సిపాల్ తెలియజేశారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.