TTD RESUMES VIP BREAK DARSHAN FOR UDAYASTHAMANA AND VIMSHATI VARSHA DADSHANI SEVAS _ నేటి నుండి ఆన్‌లైన్‌లో ఉద‌యా‌స్త‌మాన సేవ, వింశ‌‌తి వ‌ర్ష ద‌ర్శిని టికెట్లు పొందిన భ‌క్తుల‌కు విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం

Tirumala, 3 Feb. 21: Henceforth the devotees with Udayasthamana and Vimshati Varsha shall book VIP break Darshan tickets through the Donor Management system portal in online which came into force from Wednesday onwards.

It may be noted that TTD has been providing the VIP break Darshan facility to these tickets holders from September 11 onwards after arjita sevas were cancelled from March 13 last year in view of Covid 19.

On appeal by Udayasthamana seva ticket holders, TTD is providing VIP break tickets darshan to them along with the Srivani trust donors.

However from February 4 onwards, these devotees need not have to go to Arjitham Office to get their darshan tickets. Instead they can directly go for darshan with online tickets in VIP break.

For more details contact Arjitam office either on 0877-2263589 or email: arjithamoffice@gmail.com.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నేటి నుండి ఆన్‌లైన్‌లో ఉద‌యా‌స్త‌మాన సేవ, వింశ‌‌తి వ‌ర్ష ద‌ర్శిని టికెట్లు పొందిన భ‌క్తుల‌కు విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం

 తిరుమల, 2021 ఫిబ్ర‌వ‌రి 03: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో నిర్వ‌హించే ఉద‌యా‌స్త‌మాన సేవ మ‌రియు వింశ‌‌తి వ‌ర్ష ద‌ర్శిని ప‌థ‌కాల టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తులు ఆన్‌లైన్‌లో డోనార్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ పోర్ట‌ల్ ద్వారా బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్లు పొందే అవ‌కాశాన్ని బుధ‌వారం (ఈ రోజు) నుండి టిటిడి క‌ల్పించింది.  కోవిడ్ – 19 కార‌ణంగా సెప్టెంబ‌రు 11వ తేదీ నుండి ఈ సేవ టికెట్లు పొందిన గృహ‌స్తుల‌కు విఐపి బ్రేక్ ద‌ర్శనాలు క‌ల్పిస్తున్న విష‌యం విదిత‌మే.  

కోవిడ్ – 19 కార‌ణంగా గ‌త‌ ఏడాది మార్చి 13వ తేదీ నుండి శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు ర‌ద్ధు చేసిన విష‌యం తెలిసిందే. ఉద‌యా‌స్త‌మాన సేవ టికెట్లు పొందిన గృహ‌స్తుల విజ్ఞ‌ప్తి మేర‌కు శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా టికెట్లు పొందిన భక్తులతో పాటు విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నారు.

ఇత‌ర వివ‌రాల‌కు ఆర్జితం కార్యాల‌యం ఫోన్ నెం – 0877-2263589 లేదా ఇ – మెయిల్ arjithamoffice@gmail.com కు సంప్ర‌దించాలి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.