నేడు శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్ల జనవరి నెల కోటా విడుదల
నేడు శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్ల జనవరి నెల కోటా విడుదల
తిరుమల, 2024 అక్టోబరు 23: శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్ల 2025 జనవరి నెల కోటాను బుధవారం ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. రోజుకు 500 టికెట్లు, 100 గదుల చొప్పున భక్తులకు అందుబాటులో ఉంచనుంది. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని 2025 జనవరి 10 నుండి 19వ తేది వరకు టికెట్ల విడుదల వాయిదా వేయడమైనది. భక్తులు గమనించి తదనుగుణంగా ఆన్ లైన్ లో టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.