NAMAMI GOVINDA – PANCHA GAVYA PRODUCTS LAUNCHED _ “నమామి గోవింద” పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రం ప్రారంభం
DRY FLOWER TECHNOLOGY PRODUCT SALES OPENS UP TO DEVOTEES
MoU FOR CASHLESS HEALTHCARE SERVICES TO TTD – TTD CHAIRMAN
Tirupati 27 Jan. 22: The Panchagavya products manufacturing Centre was inaugurated at the old DPW stores jointly by TTD Chairman Sri YV Subba Reddy and TTD EO Dr KS Jawahar Reddy along with Tirupati MP Dr M Gurumoorthy, MLA Sri Bhumana Karunakar Reddy and Additional EO Sri AV Dharma Reddy on Thursday morning.
Thereafter an MoU for providing cashless treatment to TTD employees at all 15 prominent hospitals in the country and also sales of attractive products manufactured with Dry Flower Technology provided by YSR Horticultural University were also commenced.
Speaking on the occasion the TTD Chairman said 15 products of Panchagavya branded as “Namami Govinda” were made available to devotees at affordable prices.
These products are aimed at promoting Go puja and the health of devotees across the country by TTD in collaboration with the technical support of Ashirwad Ayurveda Pharmacy of Coimbatore. All the raw materials for Panchagavya products were sourced from TTD Goshalas.
He said as per the TTD board decision TTD had launched production of agarbatti’s from flowers used in TTD temples and received a spontaneous response and TTD plans to double the production.
He also highlighted other products of dry flower technology, Panchagavya products, MoU for TTD employees cashless treatment and programs for Hindu Sanatana Dharma propagation.
TTD EO also pointed out various other programs and schemes of TTD like the use of desi cow products in Srivari temple, kainkaryas and cow-based organic products for preparing Naivedyam etc.
He also explained the MoU for organic farming with State Government, organic manures from Cow urine and that in the coming days TTD proposed to develop 2 modernised Go Shalas in each districts of both Telugu states and to train youth in the manufacturing of Panchagavya products.
Earlier Tirupati MLA Sri Bhuman Karunakar Reddy and TTD board member Sri Pokala Ashok spoke about TTD’s long-range programs and agenda of Gosamrakshana and related activities.
Dr Ram Kumar, MD of Ashirwad explained the product range and that many more products besides the 15 Pancha gavya products will be soon introduced with the TTD initiative.
MoU FOR CASHLESS TREATMENT TO TTD EMPLOYEES
TTD has created a Health Fund (Arogya Nidhi) with Rs. 25crores to facilitate the cashless treatment to all its employees at 15 super speciality hospitals in the country. After the MoU, health cards were distributed to all employees.
All the delegates visited the stalls of Panchagavya, Dry Flower Technology products put up for display.
TMC mayor Dr Shirisha, Veterinary University Vice-chancellor Dr Padmanabha Reddy, Dr YSR Horticultural University VC Dr T Janakiram, SVIMS Director Dr Vengamma, JEO Sri Veerabrahmam, CVSO Sri Gopinath Jatti, SV Goshala Director Dr K Harnath Reddy, SV Ayurveda College Principal Dr Murali Krishna, Ashirwad pharmacy representatives and other officials were present.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
“నమామి గోవింద” పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రం ప్రారంభం
– భక్తులకు అందుబాటులో డ్రై ఫ్లవర్ టెక్నాలజితో తయారు చేసిన కళాకృతులు
– టిటిడి ఉద్యోగులకు నగదు రహిత వైద్యంపై ఎంఓయు
– టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి
తిరుపతి, 2022 జనవరి 27: తిరుపతి పాత డిపిడబ్ల్యు స్టోర్స్‌లో పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, తిరుపతి ఎంపి డాక్టర్ శ్రీ గురుమూర్తి, యం.ఎల్.ఏ శ్రీ భూమన్ కరుణాకర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం టిటిడి ఉద్యోగులకు నగదు రహిత వైద్యం కోసం దేశంలోనే 15 ప్రముఖ వైద్యశాలలతో ఎంఓయు కుదుర్చుకున్నారు. తరువాత వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో డ్రై ఫ్లవర్ టెక్నాలజితో ఆకర్షణీయంగా రూపొందించిన శ్రీవారి ఫోటోలతో పాటు కీ చైన్లు, పేపర్ వెయిట్లు, విక్రయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ….
పంచగవ్య ఉత్పత్తులు –
టిటిడి ఆధ్వర్యంలో “నమామి గోవింద” పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రం ప్రారంభించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా 15 రకాల ఉత్పత్తులు భక్తులకు అందుబాటులో ఉంచామన్నారు. సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా దేశంలోని ప్రతి ఆలయంలో గోవు ఉండాలి, గో పూజ నిర్వహించాలన్నారు. భక్తులు, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, ఇందుకోసం కోయంబత్తూరుకు చెందిన ఆశీర్వాద్ ఆయుర్వేద ఫార్మసీ సాంకేతిక సహకారంతో ఈ ఉత్పత్తులు తయారు చేస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన పంచగవ్యలను టిటిడి గోశాలలోని గోవుల నుండి సేకరించనున్నట్లు తెలిపారు.
టిటిడి ధర్మకర్త ల మండలి నిర్ణయం మేరకు టిటిడి గో శాలలను అభివృద్ధి చేయడంతో పాటు దేశంలోని వివిధ గోశాలల అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. టిటిడి ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో తయారుచేస్తున్న అగరబత్తీలకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు. కావున అగరబత్తీల ఉత్పత్తి రెండింతలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజితో తయారు చేసిన కళాకృతులు గురువారం నుండి భక్తులకు విక్రయించనున్నట్లు చెప్పారు. టిటిడి ఉద్యోగులకు నగదు రహిత వైద్యం కొరకు 15 వైద్యశాలలతో ఎంఓయు చేసుకున్నట్లు తెలిపారు. రాబోవు రోజుల్లో సనాతన ధర్మ వ్యాప్తికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.
అనంతరం ఈవో మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గోమాత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు పంచగవ్యాలతో పలురకాల గృహావసర ఉత్పత్తులు తయారు చేయాలని టిటిడి నిర్ణయించిదన్నారు. ఇందులో బాగంగా నమామి గోవింద బ్రాండ్ పేరుతో 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను నేటి నుండి తిరుమలలో భక్తులకు విక్రయానికి ఉంచామన్నారు. శ్రీవారి ఆలయంలో కైంకర్యాలకు దేశీయ గో జాతుల నుండి సేకరించిన పాలు, నెయ్యి వినియోగిస్తున్నామన్నారు. అదేవిధంగా గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలతో స్వామివారికి నైవేద్యం, గత ఏడాది నవనీత సేవ ప్రారంభించామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయంపై ఎంఓయు కుదుర్చుకున్నామన్నారు. ఇందులోని రైతులు గోవుల నుండి లభించే గో మూత్రం, గోమయం నుండి ఘన జీవామృతం, ద్రవ జీవామృతం తయారు చేసుకుని, రసాయన ఎరువులు వినియోగించకుండా పండించిన పప్పు దినుసులను టిటిడి కొనుగోలు చేస్తుందన్నారు. రాబోవు రోజుల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాకు రెండు ఆధునిక గోశాలను అభివృద్ధి చేసి, అక్కడ ఉన్న యువతకు పంచగవ్య ఉత్పత్తులపై శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు.
అంతకుముందు తిరుపతి యం.ఎల్.ఏ శ్రీ భూమన్ కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ టిటిడి సాంప్రదాయ పద్దతులు, ఆచారాలు, సంస్కృతిని కాపాడటానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. సాంప్రదాయ పద్ధతుల్లో గోసంరక్షణ కోసం చేపట్టిన అనేక కార్యక్రమాల్లో పంచగవ్య ఉత్పత్తుల తయారీ కూడా ఒకటన్నారు. గోవు పాలు, పెరుగు, నెయ్యికి ఎంత విశిష్టత ఉందో, గోమూత్రం, గోమయం(పేడ)కు కూడా అంతే విశిష్టత ఉందన్నారు. సనాతన భారతీయ ఆయుర్వేద వైద్యంలో వీటిపాత్ర కీలకమైనదని ప్రజలకు తెలియజేసేందుకు టిటిడి పంచగవ్య ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చిందని వివరించారు.
అనంతరం టిటిడి బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ గోమాతకు, భూమాతకు అవినాభావ సంబంధం ఉందన్నారు. అందుకే ఈ ఉత్పత్తులన్నింటికీ భూమాత పేర్లు పెట్టడం జరిగిందన్నారు. గోవు నుండి లభించే పంచగవ్యలను గుర్తించి, దేశ విదేశాల్లోని ప్రజలందరూ గోవులను రక్షించుకోవడం ద్వారా ఆయురారోగ్యాలతో ఉంటారని వివరించారు.
తరువాత ఆశీర్వాద్ సంస్థ ఎండి డాక్టర్ రాంకుమార్ మాట్లాడుతూ పంచగవ్య ఉత్పత్తులతో తయారు చేసిన హెర్బల్ సోప్, ధూప్ చూర్ణం, అగరబత్తీ, హెర్బల్ షాంపు, హెర్బల్ టూత్ పౌడర్, విభూది, నాజిల్ డ్రాప్స్, హెర్బల్ ఫేస్ ప్యాక్, ధూప్ చూర్ణం, హెర్బల్ ఫ్లోర్ క్లీనర్, ధూప్‌చూర్ణం సాంబ్రాణి కప్, ధూప్ కోన్, ధూప్ స్టిక్స్, గో అర్కం, పిడకలు, కౌడంగ్ లాగ్ ఉన్నాయన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న 15 రకాల ఉత్పత్తులతో పాటు త్వరలోనే మరిన్ని ఉత్పత్తులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
టిటిడి ఉద్యోగులకు నగదు రహిత వైద్యం కోసం ఎంఓయు –
టిటిడి ఉద్యోగులకు మరింత ఆరోగ్య భద్రత కోసం దేశంలోని 15 ప్రముఖ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం కొరకు ఎంఓయు చేసుకున్నారు. ఇందుకోసం టిటిడి ఉద్యోగులకు రూ.25 కోట్లతో ఆరోగ్య నిధి ఏర్పాటు చేశారు. అనంతరం ఉద్యోగుల హెల్త్ కార్డులు పంపిణీ చేశారు.
అంతకుముందు పంచగవ్య ఉత్పత్తుల తయారీ ప్లాంట్ వద్ద శ్రీవారి చిత్రపటానికి ఛైర్మన్, ఈవో, అదనపు ఈవోలు కలిసి పూజలు నిర్వహించి ప్లాంట్‌ను ప్రారంభించారు. తరువాత పంచగవ్య ఉత్పత్తుల తయారీని పరిశీలించారు. అనంతరం పంచగవ్య ఉత్పత్తుల స్టాల్స్‌ను, డ్రై ఫ్లవర్ టెక్నాలజితో తయారు చేసిన కళాకృతుల స్టాల్‌ను పరిశీలించి, పంచగవ్య ఉత్పత్తుల లోగో, పోస్టర్లు, కర పత్రాలను ఆవిష్కరించారు.
ఈ ప్రారంభ కార్యక్రమంలో తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, పశు వైద్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డా.పద్మనాభరెడ్డి, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ టి.జానకిరామ్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ గోసినాథ్ జెట్టి, ఎస్వీ గోశాల సంచాలకులు డాక్టర్ కె.హరనాథరెడ్డి, ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ కృష్ణ ఆశీర్వాద్ సంస్థ ప్రతి నిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.