FESIVALS IN GT IN NOVEMBER _ నవంబరులో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Tirupati, 30 Oct. 19: The following are the important festivities in Sri Govindaraja Swamy temple in the month of November.
November 1-Manavala Mahamuni
Sattumora
November 2-Senadhipathi Sattumora
November 4-Sri Vedantadesikar Sattumora
November 8, 15, 22, 29
Procession of Andal Ammavaru
November 9-Kaisika Dwadasi Asthan
November 12-Pournami Garuda Seva
November 14- Procession of Sri Parthasaradhi Swamy along with Rukmini and Satyabhama
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నవంబరులో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2019 అక్టోబరు 30: తిరుపతిలో టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో నవంబరులో జరుగనున్న ఉత్సవాల వివరాలిలా ఉన్నాయి.
– నవంబరు 1న మనవాళ మహాముని శాత్తుమొర సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ మనవాళ మహామునితో కలిసి రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.
– నవంబరు 2వ తేదీ సేనాధిపతి సాత్తుమొర ఉత్సవం
– నవంబరు 4వ తేదీ వేదాంతదేశికర్ శాత్తుమొర సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ వేదాంతదేశికర్తో కలిసి రాత్రి 8 గంటలకు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
– నవంబరు 8, 15, 22, 29వ తేదీల్లో శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు ఆలయ మాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు.
– నవంబరు 9వ తేదీ కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం, పురాణ ప్రవచనం నిర్వహిస్తారు.
– నవంబరు 12న పౌర్ణమి సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామివారు సాయంత్రం 6 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.
– నవంబరు 14న రోహిణి నక్షత్రం సందర్భంగా రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు సాయంత్రం 5.30 గంటలకు భక్తులకు అభయమిస్తారు.
– నవంబరు 22న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులను అనుగ్రహిస్తారు.