KARTHIKA VANABHOJANAM OF SKVST _ న‌వంబ‌రు 23న శ్రీనివాసమంగాపురంలో కార్తీక వనభోజనం

Tirupati, 21 Nov. 19: The annual Karthika Vanabhojanam will be observed at Paruveta Mandapam near Sri Kalyana Venkateswara Swamy Temple at Srinivasa Mangapuram on Saturday. 

The processional deities will be brought to the Mandapam and the celestial Snapana Tirumanjanam will be performed between 10 am and 11 am.  After this ceremony, community dining follows. 

TTD has made elaborate arrangements for this fete as hundreds of people will converge to take part in community dining at Paruveta Mandapam. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

 

న‌వంబ‌రు 23న శ్రీనివాసమంగాపురంలో కార్తీక వనభోజనం

తిరుప‌తి, 2019 న‌వంబ‌రు 21: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో న‌వంబ‌రు 23వ‌ తేదీ శ‌నివారం కార్తీక వనభోజన కార్యక్రమం జరుగనుంది. ఈ కార‌ణంగా నిత్య‌ కల్యాణోత్సవం ఆర్జిత సేవ ర‌ద్ద‌యింది. పవిత్రమైన కార్తీక మాసంలో ఇక్క‌డ వనభోజన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ఉదయం 7 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి ఉదయం 9 గంటలకు శ్రీవారి మెట్టు వద్దగల పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ఆ తరువాత అలంకారం, వ‌న‌భోజ‌నం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్క‌డి నుండి సాయంత్రం 4 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.