నవంబరు 29న కార్తీక పర్వదీపోత్సవం
నవంబరు 29న కార్తీక పర్వదీపోత్సవం
తిరుమల, 2020 నవంబరు 28: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 29వ తేదీ ఆదివారం సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం జరుగనుంది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు నేతి వత్తులతో దీపాలు వెలిగిస్తారు. ఈ కారణంగా సహస్రదీపాలంకరణ సేవను టిటిడి రద్దు చేసింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.