POURNAMI GARUDA SEVA ON NOVEMBE 30 _ నవంబరు 30న తిరుమలలో కార్తీక మాస పౌర్ణమి గరుడసేవ
Tirumala, 27 Nov. 20: Karthika Masa Pournami Garuda Seva will be observed on November 30 in four Mada streets of Tirumala between 7pm and 8:30pm.
Similarly the Pushya Masa Pournami Garuda Seva will be observed on January 28, Magha Masa Pournami Garuda Seva on February 27.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
నవంబరు 30న తిరుమలలో కార్తీక మాస పౌర్ణమి గరుడసేవ
తిరుమల, 2020 నవంబరు 27: తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 30వ తేదీ సోమవారం రాత్రి కార్తీక మాస పౌర్ణమి గరుడసేవ జరగనుంది.
రాత్రి 7 నుండి 8.30 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
అదేవిధంగా, 2021 జనవరి 28న పుష్య మాస పౌర్ణమి గరుడసేవ, 2021 ఫిబ్రవరి 27న మాఘ మాస పౌర్ణమి గరుడసేవ జరుగనున్నాయి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.