KODANDARAMA SPARKLES AS NAVNEETA KRISHNA _ నవనీతకృష్ణాలంకారంలో రామయ్య ముగ్ధమనోహర రూపం
Vontimitta, 13 April 2022: On the 4th day of the ongoing annual Sri Ramanavami Brahmotsavam of Sri Kodandaramaswamy temple at Vontimitta in YSR Kadapa district, Kodandarama glittered in Navneeta Krishna alankaram on Wednesday morning.
The celestial procession was a grand spectacle with bhajan and Kolata teams and Mangala Vaidyams as devotees offered Harati all throughout.
Later in the afternoon, Tirumanjanam fete was performed for utsava idols.
DyEO Dr Ramana Prasad, AEO Sri Subramaniam, Superintendent Sri P Venkateshaiah, Temple inspector Sri Dhananjay was Present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
నవనీతకృష్ణునిగా శ్రీకోదండరామస్వామి కటాక్షం
ఒంటిమిట్ట, 2022 ఏప్రిల్ 13: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం నవనీత కృష్ణాలంకారంలో స్వామివారు కటాక్షించారు.
ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు వేడుకగా అభిషేకం చేశారు.
సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరగనుంది. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు హనుమంత వాహనంపై శ్రీకోదండరామస్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈఓ డా. రమణప్రసాద్, ఏఈఓ శ్రీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ శ్రీ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.