WORKSHOP TO SPREAD AWARENESS ON PANCHAGAVYA PRODUCTS_ పంచగవ్య ఉత్పత్తులపై అవగాహన కోసం వర్క్ షాప్ – టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి

Tirupati, 27 June 2023: TTD JEO for Health and Education Smt Sada Bhargavi has directed officials to conduct a workshop in the SV Ayurveda college to spread awareness on Panchagavya products. 

Addressing a review meeting at TTD administrative building on Tuesday she urged officials to organize awareness campaigns in SVBC and other social media platforms.

Among others she discussed on quality, sales, production and approach to devotees, sales of last year, this year and last month with Ashirwad company etc.

She also advised officials to set up more sales counters, mosquito sprays and sanitisers in the next 20 days, develop new software for sales, register the Namami Govinda trade mark and fire fighting measures in production units. 

SVBC CEO Sri Shanmukh  Kumar, CAuO Sri Shesha Shailendra, PRO Dr Ravi, Ayurveda College principal Dr Murali Krishna,Goshala Director Dr Harnath Reddy, DyEO Sri Gunabushan Reddy and IT GM Sandeep were present. 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పంచగవ్య ఉత్పత్తులపై అవగాహన కోసం వర్క్ షాప్ – టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి 27 జూన్ 2023: టీటీడీ ఆధ్వర్యంలో తయారు చేస్తున్న పంచగవ్య ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించాలని జేఈవో శ్రీమతి సదా భార్గవి ఆదేశించారు.

టీటీడీ పరిపాలన భవనంలోని తన చాంబర్ లో మంగళవారం ఆమె పంచగవ్య ఉత్పత్తులపై సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా జేఈవో మాట్లాడుతూ, పంచగవ్య ఉత్పత్తుల పై ప్రజలకు మరింత అవగాహన కల్పించడం కోసం ఎస్వీ బీసి , ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కల్పించాలని సూచించారు. పంచగవ్య ఉత్పత్తుల తయారీ, అమ్మకాలు, నాణ్యత ప్రమాణాలు , భక్తులకు అవి అందుతున్న విధానంపై ఆమె ఆశీర్వాద కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. వివిధ ప్రముఖ ఆలయాల వద్ద గత ఏడాది, ఈ ఏడాది, గత నెల ఈ నెల విక్రయాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంలో విక్రయాల కౌంటర్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దోమల నివారణకు ఒకటి, చేతులు శుభ్రం చేసుకోవడానికి మరొక లిక్విడ్ ను 20 రోజుల్లో అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. విక్రయాల కోసం ప్రత్యేకంగా అప్లికేషన్ తయారు చేయాలని ఐ టి జిఎం ను జేఈవో ఆదేశించారు. నమామి గోవింద ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కోసం చర్యలు తీసుకోవాలని ఆమె చెప్పారు. నమామి గోవింద ఉత్పత్తుల తయారీ కేంద్రం లో అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.

ఎస్వీ బీసి సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేష శైలేంద్ర, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ కృష్ణ, పిఆర్వో డాక్టర్ రవి, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీ గుణభూషణ రెడ్డి, ఐటి జిఎం శ్రీ సందీప్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది