SERVE DEVOTEES DILIGENTLY IN PANCHAMI THEERTHA FETE – TTD EO _ పంచమి తీర్థానికి వచ్చే భక్తులకు అంకితభావంతో సేవలు అందించండి• టిటిడి ఉద్యోగుల సేవలపై ఆనందం వ్యక్తం చేసిన ఈవో శ్రీ జె. శ్యామల రావు
SRIVARI SEVAKS SERVICE LAUDED EVERYWHERE
EO EXPRESSES SATISFACTION ON TTD EMPLOYEES’ DEDICATED SERVICE
Tirupati, 05 December 2024: TTD EO Sri J Syamala Rao urged TTD employees and Specially deputed officials, Srivari Sevaks to serve the devotees coming for Panchami Thirtham on Friday December 6 with more dedication.
Addressing the employees and Srivari Sevaks on the eve of the Panchami Thirtham fete at Asthana Mandapam on Thursday evening then EO said a large number of devotees from Tamilnadu and other regions are expected to reach the four holding zones at Tiruchanoor for holy bath.
He directed employees and Srivari Sevaks to coordinate efforts for serving Annaprasadam, Snacks, drinking water and badam milk to devotees in those zones.
He said as many as 16,000 can take a holy bath in one go and said since the holiness of Panchami thirtha fete remains till evening 5 pm devotees could take holy dip in the Pushkarini comfortably and without hassle.
TTD has made elaborate entry and exit points at the Pushkarini with queue lines, barricades etc manned by 1700 vigilance personnel, drones, CC cameras etc.
He said the service provided by the Srivari Sevaks to devotees has brought stellar name to TTD and also appreciated the dedicated services of employees to devotees.
JEO Sri Veerabrahmam, CVSO Sri Sridhar, CE Sri Satyanarayana, temple Dyeo Sri Govindarajan, deputation employees and Srivari Sevaks were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పంచమి తీర్థానికి వచ్చే భక్తులకు అంకితభావంతో సేవలు అందించండి
• శ్రీవారి సేవకుల సేవల వల్ల చాలా మంచి పేరు వచ్చింది
• టిటిడి ఉద్యోగుల సేవలపై ఆనందం వ్యక్తం చేసిన ఈవో శ్రీ జె. శ్యామల రావు
తిరుపతి, 2024 డిసెంబరు 05: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖమైన పంచమి తీర్థానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు హృదయ పూర్వకంగా సేవలందించాలని టిటిడి ఈవో శ్రీ జె.శ్యామలరావు పిలుపునిచ్చారు. పంచమి తీర్థానికి డిప్యూటేషన్ పై నియమితులైన ఉద్యోగులు తమ విధులను మరింత అంకితభావంతో సేవలు అందించాలని టీటీడీ ఈవో కోరారు.
తిరుచానూరు ఆస్థాన మండపంలో గురువారం సాయంత్రం ప్రత్యేకంగా టిటిడి సిబ్బందిని, శ్రీవారి సేవకులను ఉద్దేశించి ఈవో మాట్లాడుతూ, పంచమి తీర్థం పర్వదినం సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు తమిళనాడు, ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కొరకు తిరుచానూరులో నాలుగు హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే భక్తులు హోల్డింగ్ పాయింట్లలో విశ్రాంతి తీసుకుంటున్నారని, వీరికి అన్న ప్రసాదాలు, అల్పాహారము, తాగునీరు, బాదంపాలు అందించేందుకు టిటిడి ఉద్యోగులు, శ్రీవారి సేవకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పుష్కరిణిలో ఒకేసారి 16 వేల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించవచ్చని, రోజంతా స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. శుభ ఘడియలు రోజంతా ఉంటాయని, భక్తులు తోపులాటలకు గురికాకుండా సాయంత్రం వరకు స్నానం ఆచరించవచ్చు అని తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు. పుష్కరిణిలోకి అవసరమైన ప్రవేశ, నిష్క్రమణ గేట్లు, క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు. 1700 మంది భద్రతా సిబ్బంది, డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నట్లు వివరించారు.
శ్రీవారి సేవకులు భక్తులకు అందిస్తున్న సేవల వల్ల టిటిడికి చాలా మంచి పేరు వచ్చిందన్నారు. అదేవిధంగా టిటిడి ఉద్యోగులు మరింత బాధ్యతతో సేవలు అందించాలని, ఉద్యోగుల సేవలపై ఈవో ఆనందం వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఉదయం 4.30 గంటలకు శ్రీవారి సారే బయలుదేరి అలిపిరికి చేరుకుంటుందని చెప్పారు. అలిపిరి నుండి శ్రీ కోదండ రామస్వామి ఆలయం, శ్రీ గోవిందరాజుస్వామి ఆలయం, తిరుచానూరులోని పసుపు మండపం, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తర్వాత పంచమి మండపంకు తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించనున్నట్లు చెప్పారు. సారే ఊరేగింపులో ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో వివరించారు.
పంచమి తీర్థం రోజున ప్రత్యేకంగా 1,000 మంది శ్రీవారి సేవకులతో అన్నప్రసాదం, తాగునీరు పంపిణీ చేయనున్నట్లు ఈవో తెలిపారు.
ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, సిఈ శ్రీ సత్యనారాయణ, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవిందా రాజన్, డిప్యుటేషన్ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Text content