CULTURAL ARTS ENTHRAL DEVOTEES  _ పల్లకి ఉత్సవంలో ఆక‌ట్టుకున్న వైలాట్యం, గరిగెల భజన

Tirupati, 24 November 2022:  Devotees participating in Tiruchanoor Brahmotsavam are having a great time enjoying different art forms during Mohini Avataram on Thursday morning.

Folk artists from Andhra Pradesh and Tamilnadu sponsored by TTDs HDPP, Annamacharya Project and Dasa Sahitya Project also put up a spectacular show in front of vahana sevas.

Traditional Vailatyam dance was showcased by folk artists from Kanchipuram while Puli vesham dance from Vijayanagaram, Garigela dance team from Amalapuram attracted devotees.

All artists of 14 teams from Rajahmundry, Visakhapatnam, Kumbhakonam, Anakapally and  Tirupati displayed traditional dances, Kolatas and bhajans and enthralled the devotees.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పల్లకి ఉత్సవంలో ఆక‌ట్టుకున్న వైలాట్యం, గరిగెల భజన

తిరుపతి, 2022 న‌వంబ‌రు 24: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం పల్లకి ఉత్సవంలో వైలాట్యం, గరిగెల భజన, పులి వేషం క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

టీటీడీ హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస‌సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటుచేశారు.

తమిళనాడు రాష్ట్రం కాంచీపురంకు చెందిన కళాకారులు తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లోని సాంప్రదాయ వైలాట్యం నృత్యం ప్రదర్శించారు. విజయనగరంకు చెందిన పైడిమాంబ జానపద కళాబృందంలోని కళాకారులు పులి వేషం ప్రదర్శించారు. అమలాపురం కు చెందిన విజయ దుర్గ గరిగేల నాట్య బృందంలోని కళాకారులు గరిగెల నాట్యం ప్రదర్శించారు. ఇందులో అమ్మవారి ప్రతిరూపము, పూర్ణకుంభము ధరించి వారు చేసిన నృత్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అదేవిధంగా రాజమండ్రి, విశాఖపట్నం, కుంభకోణం, అనకాపల్లి, తిరుపతికి చెందిన 14 భజన బృందాల కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యం, కోలాటాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.