PADMAVATI AS JAGAN MOHINI CASTS SPELL _ పల్లకీలో మోహిని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం
Tirupati, 21 February 2025: The darshan of Sri Padmavati Devi in Mohini Alankaram on palanquin casted a magical spell on devotees on Friday.
As part of Sri Padmavati Ammavari Brahmotsavam in Chennai, Tamil Ammavaru gave darshan to the devotees as Universal Damsel Jagan Mohini.
The annual Brahmotsavam is being celebrated from February 16 to 26 at the Chennai Temple.
Temple AEO Mr. Parthasaradhi, Superintendent and other officials, devotees participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పల్లకీలో మోహిని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం
చెన్నై / తిరుపతి, 2025 ఫిబ్రవరి 21: తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు అమ్మవారు పల్లకీలో మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 16 నుండి ఫిబ్రవరి 26 వరకు వైభవంగా జరుగుతున్నాయి.
సకల లోక రక్షణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు దివ్యమోహినీ రూపంలో భక్తులను తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్ని గుర్తుంచుకోలేకపోయింది. కనుక అమ్మవారు జగన్మోహినియై పల్లకీలో కూర్చొని ఉంటారు.
ఇందులో భాగంగా ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం సర్వభూపాల వాహనంపై, రాత్రి గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ పార్థసారధి, సూపరింటెండెంట్ శ్రీమతి పుష్పలత, ఆలయ అర్చకులు ఇతర అదికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది