UNIQUE DANCES MUSES _ పల్లకీ సేవలో ఆకట్టుకున్న తీన్‌మార్ డ్రమ్స్, రింగ్ ఫ్యూజన్, ట్రైబల్ డాన్స్, కోలాటాల ప్రదర్శనలు
TIRUPATI, 21 NOVEMBER 2025: The fifth day witnessed some unique artforms that amazed devotees.
On Friday, in front of Pallaki Utsavam, Ring Dance, Teenmar Drums, Tribal dance were performed besides the traditional artforms.
Around 300 artistes from 15 groups presented their skills during the ongoing Tiruchanoor Brahmotsavams.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
పల్లకీ సేవలో ఆకట్టుకున్న తీన్‌మార్ డ్రమ్స్, రింగ్ ఫ్యూజన్, ట్రైబల్ డాన్స్, కోలాటాల ప్రదర్శనలు
తిరుపతి, 2025 నవంబరు 21: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం పల్లకీ సేవలో తీన్‌మార్ డ్రమ్స్, రింగ్ ఫిజన్, ట్రైబల్ డాన్స్, కోలాటాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 15 కళాబృందాలలో దాదాపు 300 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు.
తీన్‌మార్ డ్రమ్స్
నూజివీడుకు చెందిన అమరావతి డ్రమ్స్ రాంబాబు బృందం తీన్‌మార్ డ్రమ్స్‌తో భక్తులను విశేషంగా ఆకర్షించారు. మొత్తం 15 మంది కళాకారులు లయబద్ధంగా డ్రమ్ములు వాయిస్తూ భక్తులను ఆకట్టుకున్నారు.
తణుకుకు చెందిన అంబిక డ్యాన్స్ అకాడమికి చెందిన బృందం 20 మంది కళాకారుల రింగ్ ఫ్యూజన్ నృత్యం, నూజివీడుకు చెందిన లాలేశ్వర రావు బృందంలోని 35 మంది కళాకారుల చెక్కభజనలు, కొవ్వూరుకు చెందిన శ్రీ శివరామకృష్ణ బృందం ట్రైబల్ డ్యాన్స్ భక్తులను కనువిందు చేశాయి. తిరుపతికి చెందిన హరిత బృందం వివిధ దేవతామూర్తులు, తిరుపతికి చెందిన డాక్టర్ మురళీకృష్ణ బృందం నవదుర్గలు, అష్టలక్ష్మీల వేషధారణ భక్తులను కనువిందు చేశాయి.
చిత్తూరుకు చెందిన వాణిశ్రీ బృందం, ప్రొద్దుటూరుకు చెందిన కృష్ణవేణి బృందం, రైల్వే కోడూరుకు చెందిన సుజన బృందాల కోలాటాలు అలరించాయి.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.











