DIVINE FACETS IN PANCHARATRA AGAMA _ పాంచరాత్ర ఆగమంలో భగవంతుని లీలావిశేషాలు- శ్రీ శఠగోప రామానుజ జీయర్ స్వామి
TIRUPATI, 01 DECEMBER 2023: Akhila Bharata Bhagavad Shastra Pancharatra Agama Vidwat Sammelan begins at Tiruchanoor Astana Mandapam on Friday.
On this occasion, Melkote Pontiff Sri Shatagopa Ramanuja Jeersawamy advocated that the Pancharatra Agama is the basis for all temple Nitya Kainkaryams and also the narrative of all facets of Sri Venkateswara.
He was participating as chief guest at the three-day conference of the Vidwat Sammelan organised jointly by the TTD’s Alwar Divya Prabanda Project and the Bhagavat Shastra Pancharatra Agama Samrakshana Sabha.
He said the Agama contained basic tenets of worshiping and temple maintenance.
Sri Ananta Venkata Dikshitulu, Pundit at Dharmagiri Veda Vignana Peetham in Tirumala said the PPancharatra agama comprised secrets of Vedas.
Sri Rama Bhattar of Srirangam Pancharatra Agama Samrakshana Sabha , also spoke about the great information treasurised in the Agama that is useful for today’s life style.
Sri Purushottam, coordinator of the Alwar Divya Prabanda project and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
పాంచరాత్ర ఆగమంలో భగవంతుని లీలావిశేషాలు – శ్రీ శఠగోప రామానుజ జీయర్ స్వామి
– తిరుచానూరులో అఖిల భారత భగవత్‌శాస్త్ర పాంచరాత్ర ఆగమ విద్వత్ సమ్మేళనం ప్రారంభం
తిరుపతి, 2023 డిసెంబరు 01: పాంచరాత్ర ఆగమం ద్వారా భగవంతుని లీలావిశేషాలను అవగతం చేసుకోవచ్చని, ఆలయ కైంకర్యాలకు ఇది మార్గదర్శనంగా నిలుస్తోందని మేల్కొటెకి చెందిన శ్రీ శఠగోప రామానుజ జీయర్ స్వామి ఉద్ఘాటించారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, భగవత్‌శాస్త్ర పాంచరాత్ర ఆగమ సంరక్షణ సభ సంయుక్త ఆధ్వర్యంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దగల ఆస్థానమండపంలో శుక్రవారం అఖిల భారత భగవత్‌శాస్త్ర పాంచరాత్ర ఆగమ విద్వత్ సమ్మేళనం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ శఠగోప రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ పాంచరాత్ర ఆగమంలో లో భగవదారాధన ఎంతో విశేషమైనదని, ఆలయం నిర్వహణకు సంబంధించిన సమస్త విషయాలు ఇందులో ఉన్నాయని తెలియజేశారు.
తిరుమల ధర్మగిరి వేద పాఠశాల పండితులు శ్రీ అనంత వెంకట దీక్షితులు మాట్లాడుతూ ఈ ఆగమంలోని నిగూఢమైన విషయాలను వేద, ఆగమ విద్యార్థులు అవగాహన చేసుకుని, పాంచరాత్ర ఆగమాన్ని విశ్వవ్యాప్తం చేయాలని కోరారు.
శ్రీరంగం శ్రీ పాంచరాత్ర ఆగమ సంరక్షణ సభ నిర్వాహకులు శ్రీ రామభట్టర్ మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచానికి అవసరమైన ఎన్నో విషయాలు పాంచరాత్ర ఆగమంలో ఉన్నాయని, ఇది చతుర్వేదాలకు, సకల శాస్త్రాలకు మూలమని తెలియజేశారు.
అనంతరం శ్రీరంగం శ్రీ పాంచరాత్రాగమ సంరక్షణ సభ కార్యదర్శి శ్రీ జయపాల్ దంపతులను స్వామీజీ ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, పాంచరాత్ర ఆగమ పండితులు శ్రీ చిలకమర్రి తిరుమలాచార్యులు, శ్రీ బాలాజీ భట్టర్, శ్రీ పరకాల స్వామి పాల్గొని ఆగమం విశిష్టతను తెలియజేశారు. ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ శ్రీ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.