TTD local temples to be closed on October 28 for Lunar eclipse _ పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అక్టోబరు 28న టీటీడీ స్థానిక ఆలయాల మూత
Tirupati, 26 October 2023: In view of the lunar eclipse from 1.05 am to 2.22 am of October 29 all TTD local temples will remain closed in the evening of Saturday, October 28 and reopened on Sunday morning after 4am.
At Tiruchanoor, Sri Padmavati temple will be closed from 5pm of 28th October and reopened at 4.30 am of October 29 and Darshan commences at 7am onwards.
At Sri Govindaraja Swami temple and Sri Kodanda Ramaswamy temple in Tirupati, and the Sri Kalyana Venkateswara Swami temple at Srinivasa Mangapuram, respective temples will be closed at 7pm of October 28 and reopened at 4.30 am of October 29 and Darshan commenced after shuddi programs.
At Sri Kodandaramaswami temple the arjita Sevas viz. Astottara Sata Kalasabhisekam and Pournami Garuda Seva at Srinivasa Mangapuram temple have been cancelled in view of the eclipse.
TTD is organising Annabhisekam at Sri Kapileswara temple on October 28 besides Deeparadhana and Anna Linga Darshan and Udwasana fetes followed by Sugandha Dravyabhishekam.
In view of the partial lunar eclipse, the temple will be shut at 6.45 pm on October 28 and reopened at 4 am of October 29th and Sarva Darshan commences after shuddi activities.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అక్టోబరు 28న టీటీడీ స్థానిక ఆలయాల మూత
తిరుపతి, 2023 అక్టోబరు 26: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అక్టోబరు 28న శనివారం సాయంత్రం టీటీడీ స్థానికాలయాల తలుపులు మూసివేస్తారు. తిరిగి మరుసటిరోజైన ఆదివారం ఉదయం ఆలయాల తలుపులు తెరుస్తారు. అక్టోబరు 29న వేకువజామున 1.05 నుండి 2.22 గంటల వరకు పాక్షిక చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అక్టోబరు 28న సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులు మూసివేస్తారు. తిరిగి అక్టోబరు 29న తెల్లవారుజామున 4.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. శుద్ధి అనంతరం ఉదయం 7 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో అక్టోబరు 28న రాత్రి 7 గంటలకు ఆలయ తలుపులు మూసివేస్తారు. తిరిగి అక్టోబరు 29న తెల్లవారుజామున 4.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. శుద్ధి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. గ్రహణం కారణంగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పౌర్ణమి అష్టోత్తర శతకలశాభిషేకం, శ్రీనివాసమంగాపురంలో పౌర్ణమి గరుడసేవ రద్దయ్యాయి.
శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో అన్నాభిషేకం
తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 28న అన్నాభిషేకం జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపడతారు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపట్టి భక్తులకు పంపిణీ చేస్తారు. శుద్ధి అనంతరం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం ఏకాంతంగా నిర్వహిస్తారు.
పాక్షిక చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ తలుపులు మూసి వేసి అక్టోబరు 29న ఉదయం 4 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.