ALL TTD TEMPLES SHUT FOR PARTIAL LUNAR ECLIPSE _ పాక్షిక చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం టీటీడీ స్థానిక ఆలయాల మూత
TIRUPATI, 28 OCTOBER 2023: Following a partial Lunar eclipse during the wee hours of October 29, all the TTD run shrines are closed in and around Tirupati six hours prior to Grahanam on Saturday.
The temple doors of Tiruchanoor, Kapileswara Swamy, Srinivasa Mangapuram, Sri Govindaraja Swamy, Sri Kodandarama Swamy were closed in the evening.
After the completion of eclipse time between 1:05am and 2:22am, the temple doors of the respective shrines will be reopened and after performing Suddhi, the devotees are allowed for darshan.
Respective temple DyEOs and staffs were present.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పాక్షిక చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం టీటీడీ స్థానిక ఆలయాల మూత
తిరుపతి, 2023 అక్టోబరు 28: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శనివారం సాయంత్రం టీటీడీ స్థానికాలయాల తలుపులు మూసివేశారు. తిరిగి మరుసటిరోజైన ఆదివారం ఉదయం ఆలయాల తలుపులు తెరుస్తారు. అక్టోబరు 29న వేకువజామున 1.05 నుండి 2.22 గంటల వరకు పాక్షిక చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులు మూసివేశారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. శుద్ధి అనంతరం ఉదయం 7 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో శనివారం రాత్రి 7 గంటలకు ఆలయ తలుపులు మూసివేశారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. శుద్ధి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం సాయంత్రం 6.45 గంటలకు ఆలయ తలుపులు మూసి వేశారు. ఆదివారం ఉదయం 4 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.