BIHAR GOVERNMENT ALLOTS LAND TO TTD TO CONSTRUCT TEMPLE _ పాట్నాలో టిటిడి ఆలయం నిర్మాణానికి బీహార్ ప్రభుత్వం అంగీకారం
Tirupati, 06 December 2025: The Bihar Government has allocated 10.11 acres of land to TTD to construct Sri Venkateswara temple in the state capital of Patna which was welcomed by the Honourable CM of AP Sri Chandrababu Naidu and AP Minister Sri Lokesh.
The TTD Chairman Sri BR Naidu expressed his happiness over the gesture of the Bihar Government for agreeing to construct a TTD temple.
The State Government Chief Secretary Sri Prataya Amrit, I.A.S., has written a letter to TTD Chairman Sri BR Naidu to this effect, allocating 10.11 acres of land in Mokama Khas area of Patna. The Bihar Government has decided to give the said land for 99 years with a token lease rent of Rs. 1.
The Chairman said the team from TTD will soon hold talks with the Director of Bihar State Tourism Development Corporation and take all necessary steps related to the construction of TTD temple.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
పాట్నాలో టిటిడి ఆలయం నిర్మాణానికి బీహార్ ప్రభుత్వం అంగీకారం
10.11 ఎకరాల భూమి కేటాయింపు
అభినందించిన ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు, మంత్రివర్యులు శ్రీ నారా లోకేశ్, టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు
తిరుపతి, 2025, డిసెంబర్ 06: బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో టిటిడి ఆలయం నిర్మించేందుకు బీహార్ ప్రభుత్వం అంగీకరించడంపై టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పాట్నాలోని మోకామా ఖాస్ ప్రాంతంలో 10.11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రతయ అమృత్, ఐ.ఏ.ఎస్., ఈ మేరకు టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడుకు లేఖ రాశారు. సదరు స్థలంలో టిటిడి ఆలయాన్ని నిర్మించేందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాట్నాలో టిటిడి ఆలయ నిర్మాణానికి భూమి కేటాయించడంపై ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హెచ్ ఆర్డీ మంత్రి శ్రీ నారా లోకేష్ అభినందించిందినట్లు ఛైర్మన్ తెలిపారు.
సదరు భూమిని 99 సంవత్సరాల పాటు రూ. 1 టోకెన్ లీజ్ రెంట్ తో ఇవ్వాలని బీహార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీహార్ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టిటిడి ఆలయాన్ని నిర్మిస్తామని టిటిడి ఛైర్మెన్ తెలిపారు. ఈ మహత్తరమైన నిర్ణయంతో బీహార్ రాష్ట్రంలో టిటిడి ధార్మిక కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఎంవోయూ చేసుకునేందుకు బీహార్ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్ ను అధికారికంగా నియమించిందుకు కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి కార్పోరేషన్ డైరెక్టర్ తో టిటిడి ప్రతినిధులు త్వరలో సంప్రదింపులు చేసి, టిటిడి ఆలయ నిర్మాణానికి సంబంధించిన అవసరమైన అన్ని చర్యలు చేపడుతామన్నారు. బీహార్ ప్రభుత్వ సహకారం, దూరదృష్టికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
