TOTAL TRANSPARENCY IN THE RECRUITMENT OF ENGINEERING POSTS- TTD CHAIRMAN _ పార‌ద‌ర్శ‌కంగా ఇంజినీరింగ్ పోస్టుల నియామ‌క ప్ర‌క్రియ‌టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి‌

DO NOT BELIEVE IN BROKERS

APPEALS TO CANDIDATES

PROCESSION FROM SVVU FOR HOMAM

Tirupati,22 November 2023: TTD Chairman Sri Bhumana Karunakara Reddy on Wednesday asserted that the recruitment in the vacant posts of the Engineering Department in TTD will be conducted in full transparent manner without giving space for any recommendations.

Addressing a media conference along with TTD EO Sri AV Dharma Reddy at Sri Padmavati Rest House, he said neither the TTD Board nor TTD officials will involve and there is no room for recommendations and applicants should not get cheated by approaching brokers, he reiterated. The TTD Board Chief said the recruitment of 60 posts is being carried out on a complete merit basis through exams with the paper prepared by experts from IIT Chennai. “In a phased manner we will fulfil vacancy in educational institutions also”, he maintained.

Adding further he said Notifications in prominent newspapers were issued for civil engineering posts besides being uploaded on TTD website and given scrolling in SVBC channel also.

The Chairman earlier briefed about the importance of Sri Srinivasa Divyanugraha Homam which is set to commence with a grand procession of various artistes from SV Vedic University to Alipiri Go Mandiram on Thursday.

He said the motto of the Homam is for the well-being of the humanity.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పార‌ద‌ర్శ‌కంగా ఇంజినీరింగ్ పోస్టుల నియామ‌క ప్ర‌క్రియ‌

– దళారీల మాటలు నమ్మి అభ్యర్థులు మోసపోవద్దు

– నవంబర్ 23న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్రారంభం

– టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి

తిరుపతి, 2023 న‌వంబరు 22: టీటీడీలో భర్తీ చేయబోతున్న ఇంజినీరింగ్ పోస్టుల నియామ‌క ప్ర‌క్రియ ఎలాంటి సిఫారసులకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా జరుగుతోందని టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి తెలిపారు. బుధవారం తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో ఛైర్మ‌న్, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ, టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో 60 పోస్టులు భ‌ర్తీ చేసేందుకు టీటీడీ బోర్డు నిర్ణ‌యం తీసుకుందన్నారు.

ఇందులో చైర్మన్ కు, బోర్డు సభ్యులకు, అధికారులకు ఎలాంటి ప్రమేయం ఉండదన్నారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని అభ్యర్థులను కోరారు. చెన్నై ఐఐటి ఆధ్వర్యంలో పూర్తి పార‌ద‌ర్శ‌కంగా మెరిట్ ప్రాతిప‌దిక‌న ఈ నియామ‌కాలు జరుగుతాయని వివరించారు. త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్న ఉద్యోగాల నియామక ప్రక్రియ కూడా ఇదే తరహాలో పూర్తి పారదర్శకంగా మెరిట్ ఆధారంగానే నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

నవంబర్ 23న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్రారంభం:

అలిపిరిలోని సప్త గో ప్రదక్షిణ మందిరంలో నవంబర్ 23వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమాన్ని టీటీడీ ప్రారంభించనున్నట్లు చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం నుండి నిరంతరాయంగా శ్రీవారి పాదాల వద్ద ప్రతి రోజు ఈ హోమం నిర్వహిస్తారన్నారు. పెళ్లిరోజు, పుట్టిన రోజు , ఇతర విశేష రోజుల సందర్బంగా భక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చి హోమం చేసుకోవచ్చని తెలిపారు. రూ.1000/- చెల్లించి గృహస్తులు ఇద్దరు ఈ హోమంలో పాల్గొనవచ్చని చెప్పారు. ప్రస్తుతానికి ఆఫ్ లైన్ లో 50, ఆన్ లైన్ లో 50 టికెట్లు ఇస్తున్నామని , శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యాక స్లాట్ ల విధానంలో టికెట్ల సంఖ్య పెంచుతామని చెప్పారు . శ్రీ వేంకటేశ్వర స్వామి వారు భక్తులకు అందిస్తున్న ఆశీస్సులుగా ఈ హోమాన్ని చూడాలన్నారు . ప్రతిరోజు ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ హోమ కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలియజేశారు.

వేద విశ్వవిద్యాలయం నుండి ఊరేగింపు

హోమ ప్రాశస్త్యాన్ని తెలిపేందుకు వేద విద్యార్థులు, అధ్యాపకులు, కళా బృందాలతో వేద విశ్వవిద్యాలయం నుండి గురువారం ఉదయం 7 గంటలకు ఊరేగింపుగా సప్త గో ప్రదక్షణ మందిరంకు చేరుకుంటారని వివరించారు.

ఈ సమావేశంలో జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.