పిఠాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

పిఠాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, మార్చి-11, 2011:  తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 15 నుండి 20వ తేది వరకు ఘనంగా నిర్వహిస్తారు. అంకురార్పణం మార్చి 15వ తేదిన జరుగుతుంది. అదేవిధంగా పుష్పయాగం మార్చి 20వ తేదిన నిర్వహిస్తారు.

మార్చి 16వ తేదిన ఆలయంలో జరిగే ఆర్జిత కల్యాణోత్సవంలో పాల్గొనదలచిన గృహస్థులు రూ.300/- చెల్లించి పాల్గొనవచ్చును. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.