EO LAUNCHES CENTRAL LOCKER COUNTER AT PAC 3 _ పీఏసీ-3లో కేంద్రీయ లాకర్ కేటాయింపు కౌంటర్ ప్రారంభం
Tirumala, 22 November: TTD EO Sri J. Shyamala Rao along with Additional EO Sri C.H. Venkaiah Chowdhury on Friday inaugurated the Central Locker Allocation ) at the Pilgrim Accommodation Complex-3.
Three counters have been set up for locker allocation at PAC-3.and the Devotees will now be allotted lockers at one place to avoid confusion. In all 1420 lockers will be available here for devotees who don’t get rooms.
EO inspects PAC-5 and Anna Prasada Kendra
The EO also inspected the PAC-5 building under construction in and instructed the officials to speed up and complete the construction work. He said that all kinds of basic facilities should be provided for the devotees in this building.
Later, he visited Tarigonda Vengamamba Anna Prasada Kendra and inspected the donor cell. He inspected the newly opened kiosk machine for devotees to donate and gave several valuable suggestions to the officials.
TTD CE Sri Satyanarayana, EE Sri Venugopal, DE Sri Chandra Shekhar Annadanam officials Sri Rajendra, Sri Shastri, Deputy EO Smt. Asha Jyoti, VGO Sri Surendra and other officials were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
పీఏసీ-3లో కేంద్రీయ లాకర్ కేటాయింపు కౌంటర్ ప్రారంభం
తిరుమల, 2024 నవంబరు 22: తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం-3లో కేంద్రీయ లాకర్ కేటాయింపు కౌంటర్ ను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం ప్రారంభించారు.
పీఏసీ-3లో లాకర్ కేటాయింపునకు మూడు కౌంటర్ లను ఏర్పాటు చేశారు. భక్తులు గందరగోళానికి గురికాకుండా ఇకపై ఒకే చోట లాకర్లను కేటాయిస్తారు. ఇక్కడ భక్తుల కోసం 1420 లాకర్లు అందుబాటులో ఉంటాయి. గదులు దొరకని భక్తులు అసౌకర్యం కలగకుండా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
పీఏసీ-5, అన్న ప్రసాద కేంద్రలో ఈవో తనిఖీలు
తిరుమలలో నిర్మాణంలో ఉన్న పీఏసీ-5 భవనాన్ని ఈవో పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ భవనంలో భక్తులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి చేరుకుని డోనార్ సెల్ ను పరిశీలించారు. భక్తులు విరాళం ఇచ్చేందుకు నూతనంగా ప్రారంభించిన కియోస్క్ మిషన్ తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ శ్రీ సత్యనారాయణ, ఈ ఈ వేణుగోపాల్ , డి ఈ చంద్ర శేఖర్ అన్నదానం అధికారులు రాజేంద్ర, శాస్త్రి,డిప్యూటీ ఈవో శ్రీమతి ఆశాజ్యోతి, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.