PAVITROTSAVAMS CONCLUDES _ పూర్ణాహుతితో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

Tirupati, 18 September 2024: The annual Pavitrotsavams in Sri Padmavati Ammavaru temple at Tiruchanoor concluded on a grand religious note on Wednesday.

As a part of it Visesha Puja, followed by Maha Purnahuti, Shanti Homam, Kumbha Samprokshana, Niveda were observed.

In the evening Chakra Snanam was performed and Sri Sundararaja Swamy along with Sri Padmavati Ammavaru blessed devotees on a procession.

EO TTD Sri J Syamala Rao, JEO Smt Goutami, Temple DyEO Sri Govindarajan and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

తిరుపతి, 2024 సెప్టెంబ‌రు 18: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల‌పాటు జ‌రిగిన ప‌విత్రోత్స‌వాలు బుధవారం మహాపూర్ణాహుతితో ముగిశాయి.

ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11.5 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు దంపతులు పాల్గొన్నారు.

చక్రస్నానం :

మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు శ్రీకృష్ణ స్వామి ముఖ మండ‌పంలో అమ్మవారితో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత చ‌క్ర‌త్తాళ్వార్‌ను ప‌ల్ల‌కీపై ఊరేగింపుగా ప‌ద్మ‌పుష్క‌రిణి వ‌ద్ద‌కు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీకృష్ణ‌స్వామివారు, శ్రీసుంద‌ర‌రాజ‌స్వామివారు, శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో జేఈఓ శ్రీమతి గౌతమి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో శ్రీ రమేష్, ఆలయ అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ శేష‌గిరి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ సుభాష్, శ్రీ గణేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.