PAVITROTSAVAMS CONCLUDES _ పూర్ణాహుతితో ముగిసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ప‌విత్రోత్స‌వాలు

Tirupati, 30 September 2024: The annual Pavitrotsavams in Appalayagunta concluded with Purnahuti on Monday.

Earlier during the day snapanam was performed and Tiruveedhi Utsavam in the evening.

DyEO Sri Govindarajan, AEO Sri Ramesh, Suptd Smt Sreevani and other temple staff were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ప‌విత్రోత్స‌వాలు

తిరుపతి, 2024 సెప్టెంబరు 30: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, అర్చన చేప‌ట్టారు. ఆ త‌రువాత‌ యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసస్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుక‌గా జరిగింది. ఈ సంద‌ర్భంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 6 గంటలకు తిరువీధి ఉత్సవం జరిగింది. అనంతరం పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగిశాయి.

ఈ కార్యక్రమంలో ఆల‌య ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమ‌తి శ్రీవాణి, కంక‌ణబ‌ట్ట‌ర్ శ్రీ సూర్య కుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శ్రీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.